సముద్రఖని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్ నటునిగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో ముఖ్యపాత్రలో నటిస్తూ మంచి కథలను ప్రేక్షకులకు రుచి చూపిస్తున్నారాయన.
సముద్రఖని, ధన్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘రామం రాఘవం’ (ఆర్ ఆర్) యాన్ అన్‌యూజువల్ స్టోరీ ఆఫ్ ఏ ఫాదర్ అనేది సినిమాకి ట్యాగ్‌లైన్.
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మించారు.
ఎవరూ ఊహించని ఎమోషనల్ డ్రైవ్‌తో ఈ సినిమా ఉండబోతుందని చిత్ర దర్శకుడు ధన్ రాజ్ తెలియచేశారు.
గతంలో జబర్దస్త్ నుండి దర్శకునిగా మారిన వేణు ‘బలగం’ సినిమాను లె రకెక్కించి సినిమా ప్రేక్షకులను పర్‌ప్రైజ్ చేశాడు.
ధన్ రాజ్ కూడా క్యారెక్టర్ నటునిగా చేస్తూనే జబర్దస్త్ వేదికపై అనేక షోలలో కనిపించి కమెడియన్‌గా సందడి చేసిన సంగతి తెలిసిందే.
సముద్రఖని నటునిగానే కాకుండా దర్శకునిగా కూడా మంచి పేరుంది.
మరి అలాంటి నటుణ్ని ధన్ రాజ్ ఎలాంటి కథ చెప్పి ఒప్పించి ఉంటాడు అనేది ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న.
ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానంగా ఫిబ్రవరి 21న ‘రామం రాఘవం’ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
ఈ చిత్రంతో ధన్ రాజ్ ప్రేక్షకుల దగ్గర ఎన్నిమార్కులు సంపాదించుకుంటాడో వెయిట్ చేయాలి…
శివమల్లాల
Also Read This : 23 ఏళ్లకే సన్యాసి అయిన ఐఐటియన్ ఈయన…
