కొన్ని కథలు ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి, చూడాలనిపిస్తాయి.
అలాంటి యూనివర్శల్ కథావస్తువే తండ్రి కొడుకుల కథలు. అలాంటి ఒక కథతో ప్రేక్షకులముందుకు రావటం చిన్నపాటి ఛాలెంజే.
అలాంటి ఛాలెంజ్‌ని జబర్ధస్త్‌లో కామెడి చేసి నవ్వించే నటుడు ధన్‌రాజ్ ‘రామంరాఘవం’ అని తండ్రి కొడుకుల కథను సినిమా రూపంలో చెప్పగలడా?
అనే సందేహాలు గతంలో ఉండేవి. ‘బలగం’ సినిమా తర్వాత జబర్దస్త్ వేణు బలగం వేణు అయ్యాడు.
ఆ సినిమా చూసిన తర్వాత వేణుని చూస్తే కళ్లు మారాయి.
అలాగే ఇప్పుడు ‘రామం రాఘవం’ చూసిన తర్వాత కూడా ధన్‌రాజ్‌ను చూస్తే కళ్లు మారతాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు అంటున్నారు
సినిమాని చూసిన కొంతమంది సినిమా ప్రముఖులు.
ఏమిలేకుండా, ఏమి తెలియకుండా సినిమా హీరో ఐపోవాలని హైదరాబాద్ వచ్చిన ధన్‌రాజ్ నటునిగా రాణించిన సంగతి తెలిసిందే.
దర్శకునిగా ‘రామం రాఘవం’తో తన ఇన్నింగ్స్‌ని తాను ఎలా తీర్చి దిద్దుకుంటాడో ఈ నెల 21వరకు వెయిట్ చేయాలి.
తను నటునిగా నటించిన మొదటి సినిమానే వాళ్ల అమ్మ చూసిన ఆఖరి సినిమా అని చెప్పినప్పుడు తన కళ్లల్లో ఉన్న బాధను ఎంతని చెప్పాలి?
అలాగే వాళ్లమ్మ వెళ్లిపోతూ, వెళ్లిపోతూ తనకి భార్య రూపంలో మరో అమ్మని ఇచ్చి వెళ్లందని చెప్పారు.
ఈ ఇంటర్వూ చూస్తే కష్టాలంటే, ఆకలంటే ఏమిటో ఖచ్చితంగా తెలుస్తుంది.
ఏదేమైనా ధన్‌రాజ్ సముద్రఖని వంటి మల్టీటాలెంట్ నటుడిని తన కథతో ఒప్పించి ‘రామం రాఘవం’ తీయగలిగాడు….
మీరు ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌లో ధన్‌రాజ్ ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ పాడ్‌కాస్ట్‌ని ఓసారి చూసేయండి..తప్పకుండా నచ్చుతుంది. పాడ్‌కాస్ట్ బై శివమల్లాల
Also Read This : 23 ఏళ్లకే సన్యాసి అయిన ఐఐటియన్ ఈయన…