Rama Pravara :
రాజ్యమంటే రామ రాజ్యం….ఇలా రామాయణం గురించి ఎంతో కొంత తెలియని హైందవులు భారతావనిలో ఉండరంటే అతిశయోక్తి కాదేమో…
కానీ రాముని ముందు రామవంశం ఎక్కడనుండి వచ్చింది అని అడిగితే రాముని తండ్రి దశరధ మహారాజు అని ఆగిపోతాము ఎవరైనా.
మహావ్యోమ అనే యూట్యూబ్ చానల్‌లో ‘రామ ప్రవర’ వీడియో చూసిన తర్వాత రామాయణం అంటే రాముని ఆయనము అనగా రాముని జీవన ప్రయాణము అని తెలిసింది.
రామాయణం, సూర్యవంశం ఎక్కడ నుండి వచ్చిందో చెప్పిన పాప ధన్యోస్మి గొంతు వింటుంటే వింటే ఈ అమ్మాయి నోటితోనే రామ ఆయనం వినాలి అన్నట్లుగా ఉంది.
పట్టుమని ఐదేళ్లు కూడా నిండని ఆ పాప టాలెంట్‌ను చూసి ఎవరైనా ముగ్దులవ్వాల్సిందే. ఇంతటి గొప్ప వీడియోని సృష్టించిన తరుణ్‌ని పొగడకుండా ఉండలేక పోతున్నాను.
ఈ వర్క్‌ను చేయమని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఎంతోమంది హిందూ సంరక్షులు రుణపడి ఉంటారు. ఇలాంటి వీడియోలు భారతీయుల ఆస్థి.
ఈ టీమ్ మరిన్ని వీడియోలు చేయాలని ఆకాంక్షిస్తు ట్యాగ్‌తెలుగు.కామ్ మహావ్యోమ చానల్‌కు అభినందనలు తెలియచేస్తుంది. ధన్యోస్మి…
శివమల్లాల
Also Read This Article : చిరంజీవి చాలా పెద్ద డ్రగ్…..