Ram Pothineni: బ్యాచ్‌లర్‌ నెం–6:  రామ్ పోతినేని

Ram Pothineni :

తెలుగు సినిమా పరిశ్రమలో ఫుల్‌ టాలెంట్‌తో ప్రేక్షకులకు దగ్గరైన అనేకమంది 40 ఏళ్లకు దగ్గరపడుతున్న ఇంకా బ్యాచ్‌లర్‌లుగానే మిగిలి ఉన్నారు.

కారణం ఏదైనా వాళ్లంతా ఈ జనరేషన్‌కి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్లే. అటువంటి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ గురించి ‘ట్యాగ్ తెలుగు.కామ్’ ప్రతిరోజు ఒక పెళ్లికాని ప్రసాద్‌ కథను మీకందిస్తుంది.

ఇది కేవలం సరదాగా సినిమా లవర్స్‌కి ఇచ్చే ఇన్‌ఫర్‌మేషన్‌ మాత్రమే కానీ, ఎవరిని కించపరిచి ఇబ్బంది పెట్టే ఉద్ధేశ్యం అస్సలు లేదు.

ఈ సిరిస్‌లో ఆరవ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌  రామ్ పోతినేని.

అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్న హీరోలు అరుదు.

పైగా బ్యాక్ గౌండ్ అండ్ టాలెంట్ మిక్స్ అయ్యి ఉండటం కూడా బహు అరుదు.

అన్నీ ఉన్నా.. ప్రతి క్షణం సినిమా కోసం కష్టపడటం అన్నిటికీ మించి ఇంకా అరుదు. ఇవ్వన్నీ రామ్ పోతినేని తోనే సాధ్యం అయింది.

సినిమా సినిమాకి నటనలో, కథలలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఎనర్జిటిక్ స్టార్ గా పేరు గడించిన ఇస్మార్ట్ హీరో రామ్.

మే 15, 1988న రామ్ పోతినేని.. మురళీ పోతినేని – పద్మశ్రీ దంపతులకు జన్మించాడు. ప్రముఖ సినీ నిర్మాత ‘స్రవంతి’

రవికిశోర్ ఆయనకు పెద్దనాన్న. అలా..  రామ్ కి సినీ నేపథ్యం ఉంది, దీనికితోడు కుర్రాడు ఎర్రబుర్రగా ఉన్నాడు, హీరోని చేయండి అనే మాటలు తరుచూ వింటూ పెరిగాడు.

ఆ విధంగా  రామ్ లో చిన్నతనం నుంచే నటుడు ఎదుగుతూ వచ్చాడు. తనలోని ఆ నటుడి తపనతోనే  మొట్ట మొదట 2002లో “ఆడయాళం” అనే తమిళ షార్ట్ ఫిలింలో నటించాడు.

రామ్ ఆసక్తిని గమనించిన స్రవంతి రవికిషోర్ ను ఆశ్చర్యపరిచింది ఆ షార్ట్ ఫిల్మ్. యూరోపియన్ మూవీస్ ఫెస్టివల్లో ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు రామ్.

ఆ అవార్డే రామ్ పై స్రవంతి రవికిషోర్ కి నమ్మకం పెరిగేలా చేసింది.

మొదటి సినిమాతోనే ఫిలింఫేర్

వెంటనే.. రామ్ ను పిలిచి ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకోమని పంపాడు. శిక్షణ అనంతరం కొందరు కథలు పట్టుకొని వచ్చారు.

స్రవంతి రవికిషోర్ కి  ఏ కథ నచ్చడం లేదు. ఆ సమయంలోనే వైవిఎస్ చౌదరి కథ చెప్పాడు. అలా 2006 జనవరి 11న తన మొదటి చిత్రం “దేవదాసు” తో రామ్  ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, రామ్ కి తిరుగులేని విజయాన్ని అందించింది.

పైగా మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ సౌత్, ఉత్తమ నూతన నటుడు అవార్డును కూడా అందుకున్నాడు రామ్.

ఆ తర్వాత సుకుమార్ “జగడం” నిరాశ పరిచినా.. రామ్ నటనకు విశ్లేషకులు నుంచి ప్రశంసలు అందాయి. ఐతే,  రామ్ సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం “రెడీ”నే.

శ్రీను వైట్ల దర్శకత్వంలో 2008లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రామ్ ను మీడియం రేంజ్ స్టార్ హీరోల సరసన నిలబెట్టింది.

కానీ ఆ తర్వాత వచ్చిన “మస్కా, గణేష్” మరియు  “రామ రామ కృష్ణ కృష్ణ” చిత్రాలు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి.

ఉస్తాద్‌గా

ఇక రామ్ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా వచ్చి  గ్రాండ్ సక్సెస్‌ని సాధించింది. రామ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.

చాక్లెట్ బాయ్ నుంచి రొమాంటిక్, మాస్ అండ్ క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్‌ దెబ్బకు ఉస్తాద్‌ గానూ  పేరు తెచ్చుకున్నాడు.

తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందుతున్న రామ్ వయసు ప్రస్తుతం 34 సంవత్సరాలు. అయినా రామ్ మనసు మాత్రం ఇంకా పెళ్లి వైపు వెళ్ళలేదు.

పైగా రామ్ పై పెద్దగా ప్రేమ పుకార్లు కూడా వినిపించలేదు. ఒకటి రెండు వినిపించినా అవి నిజం అని రుజువు కాలేదు. ఏది అయితే ఏం,  మొత్తానికి రామ్ ఇంకా ఒంటరిగానే ఉన్నాడు.

మరీ  ఈ ఏడాది అయినా  రామ్ తన పెళ్లి కబురు చెబుతాడా ? లేదా.  త్వరగా  చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ట్యాగ్ తెలుగు.కామ్ రామ్ పోతినేనికి  ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ చెబుతోంది.

శివమల్లాల

 

Also Read:UCC bill: ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *