...

రివ్యూ–గేమ్‌ ఛేంజర్‌

రివ్యూ : గేమ్‌ ఛేంజర్‌
విడుదల తేది :  10–01–2025
నటీనటులు :  రామ్‌చరణ్, కియరా అద్వాణి, అంజలి, శ్రీకాంత్, ఎస్‌.జె సూర్య, సముద్రఖని, నవీన్‌చంధ్ర, రాజీవ్‌ కనకాల, సునీల్, వెన్నెల కిషోర్, నరేశ్,
ఎడిటర్‌ :  రూబెన్, షమీర్‌ మహమ్మద్‌
సినిమాటోగ్రఫీ :  తిరు
సంగీతం :  ఎస్‌.ఎస్‌ తమన్‌
కొరియోగ్రఫీ : ప్రభుదేవా, గణేశ్‌ ఆచార్య, ప్రేమ్‌రక్షిత్, జాని
నిర్మాత : శిరీష్‌– రాజు
కథ :  కార్తీక్‌ సుబ్బరాజు
స్క్రీన్‌ప్లే–దర్శకత్వం : ఎస్‌.శంకర్‌

సినిమా కథ :

భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో సిస్టమ్‌ ఎలా రన్‌ అవుతుంది.

ఆ సిస్టమ్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలీటీషియన్స్, పోలీస్, ప్రెస్‌ ఈ నాలుగు వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో ఎంతో గొప్పగా పనిచేస్తాయి.

ఈ వ్యవస్థల్లో ఎక్కడో ఓ చోట లోపం జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు.

అవినీతి లంచగొండితనం, బంధుప్రీతితో సిస్టమ్‌లో ఎవరు తప్పుచేసినా ఆ తప్పు మిగతా వాటిపై ఎలా పడుతుంది.

ఎవరు మంచి? ఎవరు చెడు? నిర్ణయించేదెవ్వరు. అడ్మినిస్ట్రేషన్‌లో ఉండి ప్రజలకు మేలు చేయొచ్చు అనే కాంటెంట్‌తో హీరో రామ్‌చరణ్‌ రెండుపాత్రల్లో నటించారు.

అప్పన్న పాత్రలో తండ్రిగా, రామ్‌నందన్‌ కొడుకుగా ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటించారు.

రామ్‌నందన్‌ (రామ్‌చరణ్‌) ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అయితే 7 మార్కులు తగ్గటంతో ఐపిఎస్‌కి సెలెక్ట్‌ అవుతాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో సిన్సియర్‌ పోలీసాఫీసర్‌గా పనిచేస్తూనే మరలా ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అవుతాడు.

తన సొంత జిల్లాకే కలెక్టర్‌గా రామ్‌కి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్‌) కుమారుడు బొబ్బిలి మోపిదేవి (ఎస్‌.జె సూర్య)కి రామ్‌నందన్‌కి గొడవ ఏంటి? అప్పన్న (పెద్ద రామ్‌చరణ్‌)కి ఏమయ్యింది?

ఇవన్నీ తెలియాలంటే సిల్వర్‌స్క్రీన్‌పై సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :

రామ్‌చరణ్‌ సినిమాకోసం ప్రాణం పెట్టారా అన్నట్లు పనిచేశారు. రెండు పాత్రల్లో కనిపించిన చరణ్‌ డాన్స్, ఫైట్స్‌లతోపాటు కొన్ని సీన్లలో చాలా బాగా నటించారు.

ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే కొన్నిసీన్లు, ఇంటర్వెల్‌ సీన్స్‌లో ఫ్రీక్లైమాక్స్‌లో రామ్‌చరణ్‌ తన మార్క్‌ను కాపాడుకున్నారు.

రామ్‌చరణ్‌ తర్వాత స్థానం ఖచ్చితంగా ఎస్‌.జె సూర్యదే. ఇద్దరు పోటిపడినట్లుగా నటించారు.

కానీ ఎక్కడకూడా సరైన ఎమోషన్‌ పండలేదు. ఫస్ట్‌హాఫ్‌ అవ్వగానే ‘ఒకేఒక్కడు’ సినిమాలా ఉందే అన్నట్లుగా అనిపిస్తుంది.

ఇలా చాలా చోట్ల చాలా సినిమాల్లో చూసిన సీన్స్‌లా అనిపిస్తాయి.

ముఖ్యంగా ఒక్కో సీన్‌కి అవసరం లేనంతమంది ఆర్టిస్ట్‌లు కనిపిస్తారు. చాలాసీన్లు మధ్యమధ్యలో అతికించినట్లుగా అనిపిస్తాయి.

టెక్నికల్‌ విభాగం :

సినిమాలో కంటెంట్‌ బావుంటే సంగీతం దానికి తోడవుతుంది.

తమన్‌ తన సంగీతంతో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలకు మంచి బీజియమ్స్‌ అందించారు.

పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. తిరు కెమెరా వర్క్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

నిర్మాత ‘దిల్‌’రాజు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్‌ మీద డాన్స్‌ చేసిందంటే అది తిరు కెమెరా పనితనమే అని చెప్పాలి. స్క్రీన్‌మీద వచ్చిన ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అందంగా ఉంది.

ప్లస్‌ పాయింట్స్‌ :

రామ్‌చరణ్‌ నటన
కెమెరా వర్క్‌
ప్రొడక్షన్‌ వాల్యూస్‌

మైనస్‌ పాయింట్స్‌ :

కథలో దమ్ములేకపోవటం
స్లో నేరేషన్‌
అవసరం లేని నటీనటులు
ఎమోషన్‌ పండకపోవటం

ఫైనల్‌ వర్డిక్ట్ : హడావుడిగా చూడాల్సిన అవసరం లేదు…

రేటింగ్‌ : 2.5/5
శివమల్లాల

Game Changer Review
Game Changer Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.