Rakesh Varre :
చాలాకాలం తర్వాత టాలీవుడ్‌కి దమ్మున్న నిర్మాత నటుని రూపంలో వచ్చాడు. ఎంత డబ్బు తెచ్చాడేంటి? దమ్మున్న నిర్మాత అంటున్నారు అనుకోవద్దు.
నిర్మాతకు ఉండాల్సిన మొదటి లక్షణం కంటెంట్ మీద కమాండ్ ఉండడం.
డబ్బు పెట్టి లెక్కలు చూడటం, రాసుకోవటం కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. డబ్బు పెట్టే నిర్మాతలు నిర్మాతలు కాదు అని నేను అనటం లేదు. డబ్బు మాత్రమే పెట్టటం నిర్మాత పని కాదు అంటున్నాను.
కొంచెం రైటింగ్ సెన్స్, కథ మీద నమ్మకం సినిమా మీద ప్యాషన్ ఉంటేనే సరైన నిర్మాత అవుతారు అనే పాయింట్ గురించి ఎప్పటినుండో మాట్లాడాలి అనుకుంటున్నా.
సరిగ్గా అలాంటి నిర్మాతను కలుసుకోవటం తాను తీసిన సినిమా ‘పేకమేడలు’ గురించి మాట్లాడటం జరిగింది. వాట్ ఏ థాట్‌ఫుల్ ప్రొడ్యూసర్ హి ఈజ్ అనిపించింది. ఇంతకి ఆ నిర్మాత పేరు చెప్పలేదు కదూ! అతని పేరు రాకేశ్ వర్రే.
బహుబలి సినిమాలో ప్రభాస్ తల నరికేది ఇతన్నే. ‘ఎవరికి చెప్పొద్దు’ సినిమాతో హీరోగా, నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అప్పటినుండి ఇప్పటివరకు సినిమా సినిమా అనే మాట తప్ప మరో టాపిక్ లేదు.
గండు చీమలకున్న బలమేంటో చీమల టీమ్ వర్క్ ఎలా ఉంటుందో తన టీమ్‌తో కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చిత్ర పరిశ్రమకు చెప్పాలనుకున్నాడు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్‌పై అనేక సినిమాలు నిర్మించారు.
తాను తీసిన సినిమాను ఎంతో చక్కగా మార్కెట్ చేసి థియేటర్‌లలో విడుదల చేసి ఓటిటి, శాటిలైట్‌ను ఎలా క్లోజ్ చేశారో చెప్పారు.
రాజమౌళిగారు, వల్లిగారు, రమగారు, నిర్మాత శోభు యార్లగడ్డ గారితో తనకున్న బాండింగ్‌తో పాటు ‘దిల్’ రాజుగారు అంటే ఎందుకు తనకి ఇష్టమో వివరించారు. తన స్నేహితుడు కేతన్, తన భార్య అనూష గురించి మాట్లాడారు.
కమిట్‌మెంట్ ‘బాహుబలి’ లాంటి సినిమా తీయటం పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడు తాను తీస్తున్న సినిమాలన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లాంటివని అంటున్నారు.
ఇండస్ట్రీకి రావాలనుకునేవారు ఇక్కడ ఏదన్నా సాధించాలి అనుకునేవారు ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్‌లో ఈ ఇంటర్వూను ఖచ్చితంగా చూడాలి.
ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : నెగిటివిటీ, ట్రోల్స్ తట్టుకోలేని రోజు విపరీతంగా ఏడుస్తాను