10 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.22.60 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ ‘రాకాస’ సినిమా

విడుద‌లైన‌ 10 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.22.60 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ ‘రాకాస’ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఇంకా త‌న స‌త్తాను చాటుతోంది. రిలీజైన రోజు నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇంకా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ కొన‌సాగుతుండ‌టం విశేషం. ఇది చూస్తుంటే ఈ స‌క్సెస్ జోరు మరింత‌గా కొన‌సాగుతుంద‌నే సంకేతాల‌ను సూచిస్తోంది.

ఈ విజ‌యానికి ప్రధాన కారణం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వ‌స్తోన్న స్పంద‌న‌. రాకాస‌ సినిమాను ప్రేక్ష‌కులు వారి కుటుంబంతో క‌లిసి వ‌చ్చి వీక్షించి స‌ర‌దాగా న‌వ్వుకుని ఆస్వాదిస్తున్నారు. ఈ రెస్పాన్స్ ప్రతి షోలో కనిపిస్తోంది. ఈ రెస్పాన్స్ కొన‌సాగుతుండ‌టంతో సినిమాకు ఓ స్థిర‌మైన ర‌న్ కొన‌మంచి స్పందన రావడం వల్ల ఈ సినిమాకు థియేట‌ర్స్‌లో స్థిరమైన రన్ కొనసాగుతోంది.

సాధార‌ణంగా ఓ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ రావ‌టం అనేది ఈరోజుల్లో అరుదుగా మారింది. అలాంటిది రాకాస సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ వ‌చ్చి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తున్నారు. ప్రేక్ష‌కులు వారి కుటుంబాల‌తో, మరోసారి ఇతరులతో కలిసి చూసేందుకు ఆస‌క్తిగా థియేట‌ర్స్‌కు వస్తున్నారు, ఇది సినిమాకు స‌హ‌జంగా పెరుగుతోన్న స్పంద‌న‌న‌ను తెలియ‌జేస్తోంది. రాకాస సినిమా అందరికీ సులభంగా అర్థమయ్యేలా వినోదాత్మక చిత్రంగా రూపొందింది. దీంతో అన్ని వయసుల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అన్నీ వ‌ర్గాల వారికి న‌చ్చ‌టంతో రాకాస మూవీ బ్యాలెన్స్‌డ్‌గా మంచి ఆద‌ర‌ణ‌తో చ‌క్క‌టి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోంది. ఇందులో చిన్న పిల్ల‌ల‌కు కావ‌ల్సిన స‌ర‌దా, ఊహాశక్తిని రేకెత్తించే సన్నివేశాలు ఉండ‌టంతో వారు ఆక‌ర్షితుల‌వుతున్నారు. అలాగే మిగిలిన ఆడియెన్స్‌కు కావాల్సిన కామెడీ, పాత్ర‌ల ఆధారంగా న‌డిచే ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాలు అన్నీ క‌ల‌గ‌లిసి ఉండ‌టంతో ప్రేక్ష‌కుల‌కు ఇదొక మంచి ఎంపిక‌గా మారుతోంది.

చ‌క్క‌టి అర్థ‌వంత‌మైన కామెడీతో ఈ సినిమా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. సంగీత్‌, గెట‌ప్ శీను ట్రాక్ ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌, న‌ట‌న‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో ప్రేక్ష‌కులు ఈ స‌మ్మ‌ర్‌లో కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడ‌టానికి ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు.

రాకాస సినిమా స్థిరమైన రన్‌ను కొనసాగిస్తోన్న త‌రుణంలో మేక‌ర్స్ ఏప్రిల్ 10 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 ఫ్లాట్ టికెట్ ధరను ప్రవేశపెట్టారు. దీంతో సినిమా ప్రస్తుతం పొందుతున్న ప్రేక్షకుల ఆద‌ర‌ణ మ‌రింత పెరిగింది. టికెట్ ధ‌ర ప్రేక్ష‌కుల అందుబాటులోకి రావ‌టం ఎంతో కీల‌క‌మ‌ని చెప్పొచ్చు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికీ ఎక్కువ వసూళ్లను సాధిస్తున్నాయి. ఇప్పటికే సినిమాతో కనెక్ట్ అయిన కుటుంబాలు మళ్లీ మళ్లీ రావడానికి కూడా ఇది ప్రోత్సాహకంగా ఉంది.

జీస్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల సినిమాను రూపొందించిన తీరు, డైరెక్ట‌క‌ర్ మాన‌స శ‌ర్మ టేకింగ్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ పని తీరుని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను సినిమా మెప్పిస్తూ ముందుకు సాగుతుండ‌టంతో ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చే సినిమాగా అభినందిస్తున్నారు.

అంద‌రినీ మెప్ప్పిస్తూ రాకాస సినిమా రన్ కొనసాగుతుంది. దీంతో థియేట‌ర్స్‌కు ఆడియెన్స్ రావ‌టానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి తోడు డిఫ‌రెట్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ, మౌత్ టాక్ కూడా తోడు కావ‌టం మంచి ప‌రిణామం. ప్రస్తుతం ఉన్న ఈ వేగం అలాగే కొనసాగుతూ, టికెట్ ధరలు కూడా అందుబాటులోకి రావడంతో, ఈ సినిమా వేసవి కాలం మొత్తం మంచి రన్ కొనసాగించే స్థితిలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *