పుష్ప రీలోడెడ్ వెర్షన్ కలెక్షన్ ఎంతో తెలేస్తే షాక్ అవుతారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది.

ఈమధ్య కాలంలో ఎంత సూపర్ హిట్ సినిమాకి అయినా కేవలం రెండు వారాలకు మించి థియేట్రికల్ రన్ రావడం లేదు.

అలాంటిది ఈ సినిమాకి గత 40 రోజులుగా అద్భుతమైన థియేట్రికల్ రన్ వస్తూనే ఉంది.

జనాల్లో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని బాగా గమనించిన మూవీ టీం రీసెంట్ గా 20 నిమిషాల అదనపు సన్నివేశాలను జత చేసి ‘పుష్ప 2 రీ లోడెడ్’ పేరుతో విడుదల చేసారు.

‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలకు కేటాయించిన కొన్ని స్క్రీన్స్ ని ఈ సినిమాతో రీ ప్లేస్ చేసారు.

అవి వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ అవ్వడం గమనార్హం. నిన్న సెకండ్ షో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే సంధ్య థియేటర్ హౌస్ ఫుల్ అయ్యింది.

దీనిని ఆ సినిమా మేకర్స్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కేవలం ఆ ఒక్క థియేటర్ మాత్రమే కాదు, సెకండ్ షోకి హైదరాబాద్ లోని 30 థియేటర్స్ లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.

దీనిని బట్టి ఈ చిత్రానికి ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

బుక్ మై షో యాప్ లో కొత్తగా విడుదలైన ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలకు 22 నుండి 30 వేల మధ్యలో టికెట్స్ అమ్ముడుపోతుంటే,

‘పుష్ప 2 ‘ కి మాత్రం ఏకంగా 30 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ రేంజ్ డామినేషన్ ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద చూపించడం నిజంగా అద్భుతమే.

ఈ థియేట్రికల్ రన్ చూస్తుంటే, ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేలాగా అనిపించడం లేదు. 58 రోజుల తర్వాతే ఓటీటీ లో విడుదల చేస్తామని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.

నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని సుమారుగా 200 కోట్ల రూపాయిలను వెచ్చించి అన్ని ప్రాంతీయ భాషలకు కొనుగోలు చేసింది.

#RRR చిత్రానికి థియేటర్స్ లో కంటే ఓటీటీ లోనే ఎక్కువ రీచ్ వచ్చింది.

వెస్ట్రన్ దేశాలకు చెందిన ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు, పుష్ప 2 కి అది రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంజు పిల్లలమర్రి

Also Read This : ఢిల్లీ స్థాయి లో అవార్డు కోసం ట్రై చేసా : సీనియ‌ర్ న‌రేష్

Actor Praneeth Reddy Exclusive Interview
Actor Praneeth Reddy Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *