ఈ బర్త్‌డే ఆయనకెంతో ప్రత్యేకం…

సినిమాకి సంబంధమే లేని ఫ్యామిలీ నుండి తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు.

ఎక్కడో ఆటో మొబైల్‌ స్పేర్‌పార్ట్స్‌ బిజినెస్‌ చేస్తూ సినిమాలపై మక్కువతో డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. ‘దిల్‌’ చిత్రంతో నిర్మాతగా తొలి అడుగు వేశారు..

ఆరోజు నుండి ఈ రోజువరకు తన ప్రయాణంలో 24 శాఖలతో 24 గంటలు గడిపారు…

21 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్క హీరోతో సినిమాలు నిర్మించారు.

రెండు నేషనల్‌ అవార్డులను తన ఖాతాలో వేసుకుని నిర్మాతగా దేశం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగారు.

పదుల సంఖ్యలో ప్రముఖ దర్శకులను, టాప్‌ టెక్నీషియన్లను చిత్ర పరిశ్రమకి అందించారు.

నిర్మాత అంటే క్యాషియర్‌ కాదు క్యారియర్‌ కాదు క్రియేటివ్‌ బిజినెస్‌ మ్యాన్‌ అని అనేక సార్లు ప్రూవ్‌చేసి

నిర్మాతల విలువను రెట్టింపు చేసి సినిమాకి నిర్మాత అంటే స్టార్‌ అని గుర్తుచేసిన స్టార్‌ ప్రొడ్యూసర్‌ అతను.

రాబోయే సంక్రాంతికి విడుదలవుతున్న పెద్ద సినిమాలు ‘గేమ్‌ఛేంజర్‌’ ‘సంక్రాంతికి వస్తున్నాం’

సినిమాలను తర్వాత నెలలో ‘తమ్ముడు’ సినిమాలు ఆయన నిర్మాణ సారధ్యంలో విడుదల అవుతున్నాయి.

ఏ రంగంలో ఉన్నా నెంబర్‌వన్‌గా ఉండాలని కలలు కన్నాడు..ఆ రంగంలో నెంబర్‌వన్‌గా నిలిచారు.

ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయన పేరు ‘దిల్‌’ రాజు అని.

ఆయన జన్మదినం సందర్భంగా డిసెంబర్‌ 18న తెలంగాణా ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (టిఎఫ్‌డిసి) చైర్మెన్‌గా కొత్త బాధ్యతలను మోయటానికి సిద్ధమయ్యారు రాజు.

ఈ పుట్టినరోజు ఆయనకెంతో ప్రత్యేకం అని ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ ఛానల్‌ ఆయనకు విశెష్‌ తెలియచేస్తూ ఆయనపై ఓ వీడియో విడుదల చేసింది. వీడియో కంటెంట్‌ బై శివమల్లాల

Dilraju TFDC Chairman
Dilraju TFDC Chairman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *