Pravasti Aradhya :
తప్పు చేయటమే కాదు..తప్పు మట్లాడేవాళ్లని ప్రోత్సహించేటట్లు మాట్లాడించటం తప్పే. తప్పును తప్పు అని చెప్పకపోవటం తప్పే.30 సంవత్సరాల చరిత్ర కలిగిన ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం గురించి మనలో చాలామంది ఎంతో గొప్పగా అనుకుంటాం.స్వర్గీయ బాలుగారు, స్వర్గీయ రామోజీరావుగార్ల ఆలోచనలనుంచి పుట్టిన గొప్ప ప్రోగ్రాం ‘పాడుతా తీయగా చల్లగా’…అలాంటి ప్రోగ్రాం నుండి ఎంతోమంది టాలెంటెడ్ సింగర్స్ బయటకు వచ్చారు. ఈ రోజు నేను ఎలిమినేట్ అయ్యాను.ఈ సింగింగ్ కాంపీటీషన్ నుండి నేను తప్పుకుంటాను. ఇక్కడ నా ఫ్యూచర్ లేదని నాకు అర్థమైంది.కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అంటూ ఎన్నో ఏళ్లుగా ( చైల్డ్ సింగర్‌గా) సింగర్‌గా ఉన్న ప్రవస్తి ఆరాధ్య మాట్లాడింది.
గత రెండు రోజులుగా ఆమె చేస్తున్న వీడియోలు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో దర్శన మిస్తున్నాయి.అకాశంలో ఉన్న వాళ్లందరిపై కిందనిల్చొని ఉమ్మి ఊస్తే అది ఎక్కడ పడుతుందో ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గత 35 ఏళ్లుగా భారతీయ సంగీత సామ్రాజ్యంలో తిరుగులేని ఆధిపత్యంతో తన భాణీలను వినిపిస్తున్న యంయం. కీరవాణిపై, 30 ఏళ్లుగా ఎంతోమంది సంగీత దర్శకుల స్వర భాణీలకు తన ఆలోచనతో మాటల చమురును అందించిపాటలు రాయటంలో తనకు తానే సాటి అనిపించుకున్న సాహిత్యపు చిచ్చరపిడుగు చంద్రబోస్‌పై,అందంగా లేనా అంటూనే తన అందమైన గళంతో ఎన్నో గొప్ప పాటలను అలవోకగా పాడిన ప్రముఖ గాయని సునీతపై ఇప్పుడిప్పుడే సంగీతంలో బుడిబుడి అడుగులు వేస్తున్న ప్రవస్తి మాట్లాడటం కరెక్ట్ కాదేమో అనిపించింది.
మనకు సంగీతం తెలియదు కదా ఒకవేళ ఆమె కరెక్టేమో అనిపించి…పదిమంది సింగర్స్, నలుగురు సంగీత దర్శకులు,ముగ్గురు రచయితలతో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేయటం జరిగింది. మనందరం జర్నలిస్ట్‌లం. కొంచెం విజ్ఞతతో వ్యవహరిస్తే సరిపోతుంది అనే ఉద్ధేశ్యంతో ఈ వీడియోలో కొన్నిసార్లు మాట్లాడటం జరిగింది. వ్యక్తిగత విమర్శలు చేస్తున్న ప్రవస్థిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి ఈటీవి వంటి సంస్థలను ఇబ్బంది పెట్టాలి అనుకోవటం తప్పులా అనిపించింది.
51 సంవత్సరాలుగా ఈనాడు పత్రికను ఒక్కరోజు కూడా మిస్ కాకుండా తీసుకువస్తున్న ఆ సంస్థలో ఎంతోమంది జర్నలిస్ట్ సోదరులు పుట్టుకొచ్చారు.ఆ సంస్థ నుండి పుట్టిన ఈ టీవిలో ఈ రోజు ప్రసారమవుతున్న కార్యక్రమం కాదిది. కయ్యానికైనా,వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి అని మన పెద్దలు అంటుంటారు.ఈ లెక్కన ప్రవస్థి చేస్తున్న ఆరోపణలు వ్యక్తిగతమైతే సంస్థ పేరుతో ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.ఇలాంటి వీడియోలు చేయటం వల్ల ఇమ్మిడియట్‌గా రికగ్నైజేషన్ వస్తుంది.కానీ ఎటువంటి రికగ్నైజేషన్ వస్తుంది అనేది మన వాళ్లందరికి మిలియన్ డాలర్ల ప్రశ్నే అవుతుంది. అతి త్వరలోనే ఈ వీడియోలకు స్వస్థి పలుకుతారని, పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వీడియో ఇది. ప్రపంచంలోని తెలుగువారందరూ ఓ సారి అలోచించండి…కంటెంట్ బై శివ మల్లాల
Also Read This : 30 ఏళ్ల చరిత్రకు మరకలంటిస్తున్న ప్రవస్థి