పూనమ్ పాండే చనిపోలేదట!
Poonam Panday News : బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయారనేది నిన్నటి సంచలన వార్త.
దీని మీద మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా పూనమ్ పాండే
మృతి చెందారంటూ ఆమె మేనేజర్ ప్రకటించడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది సంతాపం ప్రకటించారు.
32 ఏళ్ల వయసులోనే నటి తనువు చాలించడం బాధాకరమంటూ పలువురు ప్రముఖులు, పూనమ్ అభిమానులు విచారం వ్యక్తం చేశారు.
మహిళలను గర్భాశయ క్యాన్సర్ బలి తీసుకుంటున్న పరిస్థితులపై పెద్ద చర్చ కూడా జరిగింది.
అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎలా సోకుతుంది. వ్యాధి లక్షణాలు ఏంటి? నివారణ మార్గాలు ఏంటనే
విషయాలు అంతటా వైరల్‌గా మారాయి. దేశంలోని ప్రముఖ వార్తా సంస్థలన్నీ సర్వైకల్ క్యాన్సర్‌పై కథనాలు ప్రచురించాయి.
దీంతో చాలా మంది ఈ వ్యాధి గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడింది. మరోవైపు పూనమ్ పాండే చనిపోతే ఆమె భౌతిక
కాయం ఎక్కడ ఉంది? అంత్యక్రియలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి? ఇంతకీ ఆమె చనిపోవడం నిజమేనా? అన్న సందేహాలు
కూడా తలెత్తాయి. చివరికి ఈ సందేహాలే నిజమయ్యాయి. తాను మరణించానన్నది ఒట్టిదేనని, తాను చనిపోలేదని,
ఇంకా బతికే ఉన్నానని పూనమ్ పాండే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో శనివారం ఓ వీడియోను షేర్ చేశారు.
నానాటికీ ప్రమాదకరంగా మారిన సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించేందుకే తాను ఇలా చేసినట్టు చెప్పుకొచ్చారు.
‘‘మీ అందరితో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఎక్కడికీ వెళ్లలేదు. బతికే ఉన్నాను.
సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు. కానీ, దాని వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాదు.
దీనిని నివారించడం సాధ్యమే. దీనికి హెచ్‌పీవీ వ్యాక్సిన్ లేదా ముందస్తుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. సర్వైకల్ క్యాన్సర్‌తో
ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలున్నాయి. అందరికీ అవకాహన కల్పిద్దాం’’ అని అని పూనమ్ అన్నారు.
రామ్ గోపాల్ వర్మ పూనమ్ పై ప్రశంసలు
దీంతో పూనమ్ పాండే చేసిన ఈ సాహసంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తన కెరీర్‌ను రిస్క్ లో పెట్టి మరి
ఆమె ఇలా చేశారని కొనియాడుతున్నారు. పూనమ్ పాండే చర్యతో ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ అనేది పెద చర్చగా
మారిందని, దాపిసౌ అందరికీ అవగాహన కల్గిందని అంటున్నారు. అనేక మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ నుంచి
రక్షించబడతారని చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పూనమ్ పాండేపై ప్రశంసలు కురిపించారు.
‘గర్భాశయ క్యాన్సర్‌పై దృష్టిని మరల్చడానికి నువ్వు అవలంభించిన విధానం కొంత విమర్శలకు దారితీయవచ్చు.
కానీ ఈ బూటకంతో నువ్వు సాధించిన దానిని, నీ ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్‌పై సర్వత్ర
చర్చ నడుస్తోంది. ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. నీ ఆత్మ కూడా నీ అంత చాలా అందంగా ఉంది. నువ్వు చాలా ఎక్కువ
కాలం, సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
అయితే ఇదే సమయంలో పలువురి నుంచి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పూనమ్ పాండే చేసిన పనిపై పలువురు
మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే అంతా చేసిందని చెబుతున్నారు. పూనమ్ పాండేకు ఇలా వివాదాస్పద చర్యలకు
పాల్పడటం ఎప్పుడూ అలవాటే. ఒక మోడల్ అయిన పూనమ్.. ఏవో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. ఎక్కువగా
పబ్లిసిటీ స్టంట్స్‌తో ఫేమస్ అయింది. భర్త షూట్ చేస్తుంటే పోర్న్ వీడియోల్లో పాల్గొనడం…మళ్ళీ ఆ భర్తే తనని
హింసిస్తున్నాడంటూ కేసు పెట్టడం…2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతా అంటూ ప్రకటించడం ద్వారా వార్తల్లో
బాగా వైరల్ అయింది. అదిగో ఆ అలవాటే ఇప్పుడు కూడా ప్రదర్శించింది. కొన్ని రోజులుగా కామ్‌గా ఉంటున్న పూనమ్
పాండే మళ్ళీ టాక్ ఆఫ్ న్యూస్ అవ్వాలనుకుంది. దాని కోసం ఏకంగా చనిపోయినట్లు నటించి, నమ్మించింది.
అయితే ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసినందుకు పూనమ్ పాండేపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Also Read:‘హీరో’ పార్టీ.. ఎన్టీఆర్ నుంచి పవన్ కల్యాణ్ దాకా..
