ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాల పున: ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. మే 2న ఆయన అమరావతికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అమరావతి నిర్మాణాల పున: ప్రారంభోత్సవ కార్యక్రమాని ఏపీలోని దాదాపుగా అన్ని జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణను ఏపీ ప్రభుత్వం రూపొందించింది.
ఈ క్రమంలోనే ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కొందరు మంత్రులతో ఒక కమిటీ వేసింది. మరోవైపు ఎస్పీజీ బృందం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వరకూ హాజరవుతారని అంచనా వేసత్ున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించారు. ఆయా రహదారులపై వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా అధికారుల బృందం ప్రణాళికలను రచిస్తోంది.