‘వీరమల్లు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ప్లేస్, టైం ఫిక్స్

పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వేదిక కూడా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం జులై 24న పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. అయితే ప్రి రిలీజ్ వేడుక మాత్రం హైదరాబాద్‌లో నిర్వహించడం లేదు. ఈ నెల 20న విశాఖలో మేకర్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకదీరుడు రాజమౌళి హాజరు కానున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ 2:42 గంటల నిడివితో ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్‌‌ను పొందింది. అయితే చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మాత్రం చాలా వీక్‌గా ఉన్నాయి. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎందుకంత ఫోకస్ పెట్టడం లేదో తెలియడం లేదు. ఈ చిత్రానికి సంబంధించి ప్రి రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయ్యిందో ప్రమోషన్స్ పీక్స్‌లో జరిగినట్టే. ఇక చూడాలి ఏం జరుగుతుందో. జ్యోతి కృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్‌, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *