చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 49 వ మ్యాచ్ ఎంతో ఆసక్తిగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై 19.2 ఓవర్లలో నే 190 పరుగుల వద్ద చాప చుట్టేసింది. అల్ రౌండర్ సామ్ కరన్ 47 బంతుల్లో 88 పరుగులు ( 9 ఫోర్లు, 4 సిక్సర్లతో) ఒక్కడే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసి స్కోరును 190 పరుగులకు చేర్చాడు. మిగతా బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ 26 బంతుల్లో 32 పరుగులు (2 ఫోర్స్ 1 సిక్సర్) తో పరవాలేదనిపించాడు. సీనియర్ అల్ రౌండర్ రవీంద్ర జడేజా 12 బంతుల్లో 17 పరుగులు ( 4 ఫోర్లు) తర్వాత ఎక్కువ పరుగులు ఎక్సట్రాస్ రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు దక్కాయి.
యజువేంద్ర చాహల్ 3 ఓవర్స్ బౌల్ చేసి 32 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అందుకే 20 ఓవర్లు పూర్తి కాకుండానే చెన్నై టీమ్ అల్ అవుట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్స్ ప్రియాంశు ఆర్య 15 బంతుల్లో 23 పరుగులు (5 ఫోర్స్), ప్రబసిమ్రన్ సింగ్ 36 బంతుల్లో 54 పరుగులు ( 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చకా చకా స్కోర్ ను పరుగులు పెట్టించారు. ఆర్యన్ తర్వాత ప్రభ్ సిమ్రన్ కి తోడైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్ లోకి వచ్చిన దగ్గరనుండి ధాటిగా బ్యాటింగ్ చేశాడు. మరో మూడు పరుగుల దూరంలో విజయం ఉండగా 41 బంతుల్లో 72 పరుగులు (5 ఫోర్స్ 4 సిక్సర్లతో) చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ జట్టు సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది. తొలి స్థానంలో ఆర్సీబీ జట్టు ఉంది.