పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా విషయమై పవన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ సినిమా కోసం తను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో చిత్రాన్ని ఏఎం రత్నం 2020లో ప్రారంభించారు. పవన్ రాజకీయాల పరంగా బిజీగా ఉండటం.. ఆ తరువాత డిప్యూటీ సీఎం అవడంతో సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది.
దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం జూన్ 12న విడుదలకు సిద్ధమైంది. ఇంతకాలం పాటు సెట్స్‌పై ఉండటంతో సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ తన రెమ్యూనరేషన్‌ను తిరిగి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. నిర్మాతల గురించి పవన్ ఆలోచించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ఇక ఈ సినిమా హిస్టారికల్ యాక్షన్ మూవీగా రూపొందింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.