Pithapuram Pawan Kayan :
ఆరు నూరైనా అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే అంశం తరువాత.. జనం ఎక్కువగా చర్చించుకుంటున్నది పిఠాపురంలో ఎవరు గెలుస్తారు? అనే విషయం పైనే.
ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడమే ఇందుకు కారణం. 2009 ఎన్నికల్లో పవన్ కలాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే.
దీంతో ఈసారి ఆరు నూరైనా అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందేనని ఆయన పట్టుదలగా ఉన్నారు. అయితే పవన్ ను ఈసారి కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదన్న కసితో వైసీపీ ఉంది.
దీంతో రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టీ పిఠాపురం పైనే ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించిన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రను చూస్తే ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు.
అంటే సెంటిమెంట్ ప్రకారం ఈసారి ఆ పార్టీ గెలవకూడదు. కానీ, అదే సెంటిమెంట్ మళ్లీ కొనసాగుతుందా? 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు? అనేది ఉత్కంఠగా మారింది.
1978 ఎన్నికల నుంచి జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే..
1978లో కాంగ్రెస్ తరుపున కొప్పున మోహన్‌రావు గెలిస్తే..
1983లో తెలుగుదేశం వేవ్‌లోనూ స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు విజయం సాధించారు.
1985లో టీడీపీ నుంచి నాగేశ్వరరావు,
1989లో కాంగ్రెస్ నుంచి కొప్పన మోహనరావు,
1994లో టీడీపీ తరపున నాగేశ్వరరావు,
1999లో ఇండిపెండెంట్ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు విజయం సాధించారు..
2004లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు,
2009లో ప్రజారాజ్యం తరపున వంగా గీత,
2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ గెలుపొందారు..
2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో ఈ సారి గెలుపు పవన్ కల్యాణ్‌దే అని జనసేన లెక్కలు వేస్తోంది.
పవన్ కల్యాణ్ అనుకూలతలు ఇవే..
పవన్ కల్యాణ్ కు పోటీగా వైసీపీ.. ఎంపీ వంగా గీతను బరిలోకి దించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ తన ప్రతికూలతలను అన్నింటీనీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ టికెట్ ఆశించిన వర్మ చర్చించి తన దారిలోకి తెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడతలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తానని స్వయంగా చంద్రబాబు నాయుడే హామీ ఇవ్వడంతో వర్మ చల్లబడ్డారు. కాగా, ఈ నియోజకవర్గంలో 91 వేల మంది కాపు ఓటర్లు ఉండడం, అదే సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ కు మరో సానుకూలాంశం కానుంది. పైగా యూత్ ఓటర్లు పవన్‌కు అనుకూలంగా వున్నారు. సినిమాల్లో పవన్ కు ఉన్న క్రేజు యూత్ ఓటర్లు ఆకట్టుకునేలా చేస్తోంది. గతంలో ప్రజారాజ్యంకు పట్టు వున్న నియోజకవర్గం కాబట్టి పవన్ కు ఈ ఓటు బ్యాంక్ కలిసివస్తోంది.
వంగా గీత అనుకూలతలు..
వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలే.
సుదీర్ఘ రాజకీయ ఆనుభవం వుంది. ఆమె రాజకీయ ప్రస్థానంలో పలు పదవులు చేపట్టారు.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తర్వాత కాంగ్రెస్, వైసీపీలోకి వెళ్లారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచే కాకినాడ ఎంపీగానూ గెలిచారు.
అంతకు ముందు టీడీపీ నుంచి రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించారు. ఇలా అసెంబ్లీ, లోక్ సభ, రాజ్య సభ మూడు చట్ట సభలకూ ప్రాతినిధ్యం వహించిన ప్రత్యేకత ఆమె సొంతం. 10 వేల రెడ్డి ఓట్లు వున్నాయి. వైసీపీ తరఫున పోటీ చేస్తున్నందున అవి కూడా ఆమెకు పడవచ్చు. లోకల్ ఫ్యాక్టర్ తీసుకువచ్చి పవన్ నాన్ లోకల్ అనే ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఏ కుల ఓట్లపై ఎక్కువ ఆధారపడ్డారో అక్‌్డే జగన్ దెబ్బ కొట్టాలనుకుంటున్నారో, అదే సామాజికవర్గానికి చెందిన కీలక నేత ముద్రగడ వైసీపీలో చేర్చుకున్నారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వైసీపీకి కలసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.
Also Read This Article : రేవంత్ సర్కారు ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందా?