Pawan Kalyan : పదహారేళ్ల కష్టం ఒక్కమాటతో తుడిచిపెట్టుకుపోయింది

Pawan Kalyan :

కొణిదెల పవన్‌కల్యాణ్‌ అనునేను అని పవన్‌ అనగానే జనసైనికులకు తన పదహారు సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం కళ్లముందుకు వచ్చింది.

తన అన్నయ్య చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీతో సామాన్య కార్యకర్తగా చిన్నలీడర్‌ స్థాయినుండి ఈ రోజు ప్రభుత్వాన్ని మార్చేసే శక్తిగా ఎదిగిన పవన్‌ను చూసి మెగాభిమానులంతా ఆనందభాష్పాలతో అబినంధిస్తున్నారు.

ఆ ఒక్కమాట ఈ వేదిక నుండి అనటం కోసం పవన్‌కల్యాణ్‌ పడిన కష్టాలు మామూలు కష్టాలు కాదు.

రాజకీయ చదరంగంలో తాను ఎదుర్కొన్న మాటలు వ్యక్తిగతమైన విమర్శనలను సైతం లెక్కచేయకుండా తుఫాన్‌కి ఎదురు నిలబడి నిటారుగా నిలుచున్న గడ్డిపరకకు ఒక గర్వం ఉంటుంది.

అదే గర్వాన్ని ఈ రోజు ఎంతో ఆత్మాభిమానంతో పవన్‌ నిలబడిపోయిన వైనాన్ని ప్రజలందరూ గమనించారు. కష్టం ఉన్న ప్రతిచోటుకు నేను వెలుగును అవుతాను అంటూ ఎంతో స్పీడ్‌గా కష్టం ఉన్న చోటుకు అలవోకగా చేరుకున్నారు పవన్‌.

ఎక్కడ కాంప్రమైజ్‌ అవ్వాలో అక్కడ కాంప్రమైజ్‌ అంటూ చంద్రబాబుతో చేతులు కలిపి రాజీలోనే నిఖార్సయిన రాజకీయం ఉంది అంటూ తన మేధోశక్తిని ప్రదర్శించిన రాజకీయ మేధావి పవన్‌కల్యాణ్‌.

నెగ్గిన తర్వాత తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తన టీమ్‌ను కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పి వాళ్లకి తమ బాధ్యతలను గుర్తుచేశారు.

పీ.కె. సంయమనం పాటిస్తే అనుకున్న లక్షాన్ని చేధించటం పెద్ద కష్టామేమి కాదు అని నిరూపించి తనకున్న పేషెన్స్‌ని చూప్చిన సవ్యసాచి పవన్‌.

మొత్తానికి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ అనే నేను అనగానే పదహారేళ్ల శ్రమ ఒక్కసారిగా తుడిచిపెట్టినట్లయిందని జనసైనికులు తమ ఆనందాన్ని వ్యకం చేస్తున్నారు….

 

Also Read This Article : CBN ఈస్ బ్యాక్

AP CBN Oath Ceremony
AP CBN Oath Ceremony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *