Panch Minar: కసి పట్టుదలతో ఈ సినిమా తీశారు

యంగ్ హీరో రాజ్ తరుణ్, రామ్ కడుముల కాంబోలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ పై మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘‘ గోవిందరాజు గారు ప్యాషన్‌తో ఎలాగైనా సాధించాలి నిలబడాలనే కసి పట్టుదలతో ఈ సినిమాని తీశారు. ఈ సినిమాతో రాజ్ తరుణ్‌కి కూడా బెస్ట్ స్టార్ట్ అవుతుందని టీజర్ చూడగానే అనిపించింది’’ అన్నారు. నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘‘లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ గారు ఇందులో మంచి పాట రాశారు. హీరోయిన్ రాశి సింగ్ గారు తెలుగు నేర్చుకొని చాలా చక్కగా మాట్లడుతున్నారు’’ అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘‘మారుతి గారు నా మొదటి సినిమా తర్వాత ఇప్పటివరకు నన్ను నమ్మి ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన ఈవెంట్ కి వచ్చి టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని చెప్పడానికి కారణం మా డైరెక్టర్. ఆయన చాలా కష్టపడి పని చేశారు. బ్రహ్మాజీ గారితో కలిసి నటించడం ఆనందాన్నిచ్చింది. ఆయనతో నటించిన ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. మా సినిమాని థియేటర్స్‌కి వచ్చి చూడండి. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు’’ అన్నాడు. హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపింది. యాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడే కాకుండా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా నవ్వుకున్నాను. చాలా మంచి సినిమా అవుతుంది. రాజ్ తరుణ్ తొలిసారిగా తనతో యాక్ట్ చేశాను’’ అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *