అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ గురించి ఆసక్తికర వార్తలు ఎన్నో వినవస్తున్నాయి. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్2లో తెరకెక్కబోతోందనే వార్తతో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతోంది. దానిని చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేవు. ఈ చిత్రంలోకి హాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్‌మీడియాలో హ్యాష్‌ట్యాగ్స్‌తో పాటు ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం ప్రముఖ హాలీవుడ్ సంస్థ పనిచేస్తోంది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ నటుడే ఏకంగా ఈ చిత్రంలో నటిస్తున్నాడన్న వార్త అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే.. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్. ఉత్తమ నటుడిగా ఆయన ఆస్కార్ కూడా అందుకున్నారు. అలాంటి విల్ స్మిత్ అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో విలన్‌గా నటించనున్నారని సమాచారం. ఆయన గతంలో ఒక భారతీయ చిత్రంలో కేమియో రోల్ చేశారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ అనే హిందీ చిత్రంలో మెరిశారు. ఇప్పుడు తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానుందట.