Odela 2
తమన్నా ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది.
సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి మధు ఈ సినిమాను నిర్మించారు.
తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకుంది.
ఓదెల రైల్వే స్టేషన్ లాక్‌డౌన్ టైంలో చేసిన సినిమా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి.
మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది.
నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ ఓదెల 2ని ప్రేక్షకులకు ముందు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.
ఓదెల1 అవుట్ అండ్ అవుట్ మర్డర్ మిస్టరీ. ఓదెల 2 సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 మచ్ బిగ్గర్.
ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు.
అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్‌లో కనిపిస్తాను.
‘కుమారి 21ఎఫ్’ సినిమా నాకు ఒక ఫేమ్ తీసుకొచ్చింది. ఓదెల సినిమా యాక్టర్ గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది.
నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది. ఒక నటిగా ఓదెల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఓదెల సినిమా నుంచి ఆయనతో కలిసి పని చేశాను. ఆయన చాలా క్లారిటీతో ఉంటారు.
సంపత్ నంది గారు, అశోక్ తేజ గారు మంచి టీం వర్క్ తో పని చేస్తారు.
నిర్మాత మధు గారు ప్రాజెక్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.
ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా గ్రాండ్ స్కేల్ లో నిర్మించారు.
ఈ సినిమా ముహూర్తాన్ని కాశీలో చేయడం జరిగింది. ఈ కథ స్పిరుచువాలిటీ, డివోషనల్‌తో ముడిపడి ఉంటుంది.
ఇండస్ట్రీలో పదేళ్ల జర్నీ పూర్తైంది. ఈ ప్రయాణంలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ఒక నటిగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను.
సక్సెస్ ఫెయిల్యూర్ ఏది ఫైనల్ కాదు. పనిచేసుకుంటూ వెళ్లడమే మన చేతిలో ఉంది. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఇప్పటివరకు చాలా జోనర్స్ సినిమాలు ట్రై చేశాను. ఒక ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలనుంది.
నా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేసి తెలుగులో ఓ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి.
ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది’’ అని తెలిపింది.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘సోదరా’కు గవర్నర్ బెస్ట్ విషెస్..