టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చేసినా దాని వెనుక ఏదో అర్థం పరమార్థం ఉంటుందని భావిస్తారు. అయితే తాజాగా స్టార్ హీరో ఎన్టీఆర్.. సుకుమార్‌తో ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దానిని చూసిన వారంతా ఏం జరుగుతోంది.. మళ్లీ వీరిద్దరి కాంబోలో ఏమైనా సినిమా రానుందా? అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సుకుమార్ భార్య తబిత ఈ ఫోటోను షేర్ చేశారు. ఇద్దరూ కూర్చొని ఉన్నారు. సుకుమార్ ఎన్టీఆర్‌ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. ఎన్టీఆర్ కూడా హాయిగా నవ్వుతూ ఆయన భుజంపై వాలిపోయి ఉన్నాడు. ఈ ఫోటోకు తబిత.. ‘తారక్‌కు ప్రేమతో’ అని క్యాప్షన్ ఇచ్చి ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ‘నన్ను ఎప్పుడూ వెంటాడే ఓ ఎమోషన్’ అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన క్యాప్షన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్, సుక్కు కాంబోలో ‘నాన్నకు ప్రేమతో’ అనే చిత్రం వచ్చి భారీ హిట్ కొట్టింది. ఈ చిత్రంలోని డైలాగ్‌నే తారక్ ఈ ఫోటోకు క్యాప్షన్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు బాలీవుడ్లో ‘వార్ 2’ చేస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్‌తో చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు.
ప్రజావాణి చీదిరాల