యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘వార్ 2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీని ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఇక ఈ ఏడాదిలో అందరూ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల్లో ‘వార్ 2’ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ దృశ్యాన్ని చూసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది. ఇక తాజాగా ‘వార్ 2’ డబ్బింగ్ పనుల్ని షురూ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ మూవీ కోసం డబ్బింగ్ చెప్పేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ ‘వార్ 2’ వైఆర్ఎఫ్.. స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ భాగంగా రాబోతోంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీలు ప్రధాన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో అడ్రినలిన్-పంపింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతోన్నారు.
ప్రజావాణి చీదిరాల