ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది.
కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ
కర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించగా సూర్యదేవర నాగవంశీ సమర్పించారు.
ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా
ఎన్టీఆర్ మాట్లాడుతూ : ‘‘నవ్వించడం అనేది చాలా గొప్ప వరం.
మనకు ఎన్నో బాధలున్నా, కష్టాలున్నా ఎవరైనా మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది.
అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకు దొరికాడు.
కల్యాణ్‌ది స్వచ్ఛమైన హృదయం. ఆ స్వచ్ఛతను ఎప్పటికీ కోల్పోవద్దు’’ అని పేర్కొన్నారు.
ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ : ‘‘మన ఇంటి ఫంక్షన్ లో మన వాళ్ళని మనమే పొగొడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది
కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడట్లేదు.
నాకు ఇందాకటి నుంచి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అనే స్లోగన్స్ వింటుంటే ‘జైంట్’ గుర్తొస్తుంది. ఆయన నిజంగానే జైంట్’’ అన్నారు.
చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ : ‘‘నాగవంశీ గారు లేకపోతే నేను లేను, చినబాబు గారు లేకపోతే మ్యాడ్ లేదు,
ఎడిటర్ నవీన్ నూలి గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ లేదు. కాబట్టి ఈ ముగ్గురికి నేను కృతఙ్ఞతలు తెలపాలి. ’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : నెగిటివ్ టైటిల్‌తో జాతీయ అవార్డు పట్టాడు….