ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ అప్డేట్ వచ్చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వాణి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందని తెలిసినప్పటి నుంచి ప్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఎలాంటి అప్డేట్ వస్తుంది.. అది ఏ స్థాయిలో ఉంటుందని ఆసక్తిగా లెక్కలు వేస్తూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఇవాళ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ‘వార్ 2’ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అంటూ కనిపించాడు.
ఎన్టీఆర్ డైలాగ్స్ కానీ.. యాక్షన్ సన్నివేశాలతో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. కియారా చాలా అందంగా కనిపించింది. ఎన్టీఆర్, హృతిక్ మధ్య యాక్షన్ సన్నివేశాలు పీక్స్‌లో ఉంటాయని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ‘నా కళ్లు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియాస్ ది బెస్ట్ సోల్జర్’ అంటూ సాగే ఎన్టీఆర్ వాయిస్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. దాదాపుగా టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతోనే కట్ చేశారు. ‘నా గురించి తెలియదేమో.. ఇప్పుడు తెలుసుకుంటావ్.. గెట్ రెడీ ఫర్ ద వార్’ అంటూ ఎన్టీఆర్ డైలాగ్, యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రజావాణి చీదిరాల