Ram Charan: బ్రేకుల్లేకుండా పరుగులు తీస్తున్న ‘పెద్ది’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో రూపొందుతున్న సినిమా ‘పెద్ది’. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. పర్ఫెక్ట్‌గా సినిమా తీయాలే కానీ స్పోర్ట్స్ డ్రామాకు ఆదరణ ఓ రేంజ్‌లో ఉంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను బుచ్చిబాబు సాన ఏమాత్రం లాగ్ లేకుండా జెట్ స్పీడ్‌లో లాగించేస్తున్నారట. ఏమాత్రం బ్రేక్ లేకుండా పరుగులు పెట్టిస్తున్నారట. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇప్పటికే క్లైమాక్స్ షూటింగ్ పూర్తైందని తెలుస్తోంది. దాదాపుగా ఆగస్ట్ నెల లోపు రామ్ చరణ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేస్తారని సమాచారం.

ఎండింగ్ చాలా ఎమోషనల్‌గా సీన్స్‌తో బుచ్చిబాబు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఓ సాధారణ యువకుడి నుంచి క్రికెట్ గ్రౌండ్‌లో చరిత్ర సృష్టించే ప్రయాణాన్ని చూపించేలా కథను బుచ్చిబాబు ప్లాన్ చేశారట. మొత్తానికి రామ్ చరణ్ అయితే ఊర మాస్ గెటప్‌లో మరోసారి మెప్పించబోతున్నాడు. గతంలో ‘రంగస్థలం’ సినిమా చెర్రీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కూడా అదే స్థాయిలో చెర్రీకి పేరు తెచ్చిపెడుతుందని టాక్. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *