నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రానున్న చిత్రం ‘రాబిన్ హుడ్ ‘.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శ్రీలీల కథానాయికగా డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల విడుదలైన టీజర్, “వన్ మోర్ టైం” పాట ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది.
ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు.
నితిన్ మాట్లాడుతూ : ” శ్రీలీలతో కలిసి రెండోసారి నటించడం ఆనందంగా ఉంది.
మొదటి సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు కానీ ఈ సినిమాతో మాది హిట్ జోడి అవుతుంది.
నా కెరీర్లో లో ఇది అత్యంత భారీ బడ్జెట్ మూవీ. ఈ క్రిస్మస్ కు వచ్చి హిట్ అందుకుంటాను.
ఒక్క సాంగ్ మినహా షూటింగ్ దాదాపుగా పూర్తిఅయిపొయింది.” అని అన్నారు.
తెలుగు పాటలకు స్టెపలు వేస్తూ సోషల్ మీడియాలో అందరిని ఎల్లప్పుడూ అలరిస్తూ ఉండే.
ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కెమియో రోల్ లో కనిపించబోతున్నారు.
ఇప్పటికే పుష్ 2 లోని కిస్సిక్ ఐటమ్ సాంగ్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తుంది.
డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఈ సంవత్సరం గుంటూరుకారం సినిమాతో మొదలుపెట్టి….’రాబిన్ హుడ్ సినిమాతో సంవత్సరం ముగించనుంది.
ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించనున్నాడు.
సంజు పిల్లలమర్రి
Also Read This : ఈ గుమ్మడికాయకు ఐదేళ్లు….