‘నిలవే’ టీజర్‌.. ఒక అద్భుతమైన లవ్ స్టోరీ

సినిమా అంటే చెప్పలేనంత ప్రేమ, అభిరుచి ఉన్నవారు ఎంతో మంది ఉంటారు. ఒక్క ఛాన్స్ కోసం తపిస్తూ ఉంటారు. అసలు వారికి ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధాలూ ఉండవు. అలా ఒక ఛాన్స్ కొట్టేసి ‘నిలవే’ సినిమా తీశారు. ఇది తెలుగు సినిమాలో అతి పెద్ద మ్యూజికల్ డ్రామాగా రూపొందింది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ఈ చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈసినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో అర్జున్ (సౌమిత్ రావు) అనే వ్యక్తి, తన ఒంటరి జీవితాన్ని కష్టంగా గడుపుతుంటాడు. తనకొక ప్రేమ కావాలని తాపత్రయ పడుతుంటాడు.

అలాంటి అతని జీవితంలోకి శ్రేయాసి సేన్.. ప్రవేశించి అతని జీవితంలో కొత్త కాంతిని తీసుకొస్తుంది. ఇక ఆ అమ్మాయి కోసం అర్జున్ ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధపడతాడు. మొత్తానికి టీజర్ చెప్పిన స్టోరీ ఇది. 155 సెకన్ల నిడివి కలిగిన ఈ టీజర్‌ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకునేలా ఉంది. చాలా మంది ఇలా ఒంటరిగా కాలం గడుపుతూ ఎవరో ఒకరి ప్రేమను పొందేందుకు నానా తంటాలు పడుతుంటాడు. అద్భుతమైన విజువల్స్.. మనసును తాకే సంగీతంతో, ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా టీజర్ ఉంది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్‌ అని టీజర్‌ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గోల్లపూడి, అనాల సుష్మిత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *