Neuralink Human Trials: ఫోన్ యాప్‌తో మనిషి మెదడు కంట్రోల్..

Neuralink Human Trials :

రిమోట్‌తో టీవీని కంట్రోల్ చేసినట్లు.. ఫోన్ యాప్‌తో మనుషుల మెదడును కంట్రోల్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

ఏదైనా ఒక వ్యక్తిని ఎంచుకొని అతడు ఏం ఆలోచించాలో.. ఏం మాట్లాడాలో ఓ యాప్ సాయంతో మనమే ఆదేశించే దారుణమైన టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రాబోతోంది.

ఈలన్ మస్క్ కు చెందిన స్టార్టప్ న్యూరాలింక్ ఇందుకు సంబంధించి కీలక అడుగు వేసింది. ఓ మనిషి మెదడులో కంప్యూటర్ లో ఉండేలాంటి ఎలక్ట్రానిక్ చిప్‌ను వియవంతంగా అమర్చింది.

ఈ చిప్‌ ద్వారా మెదడుకు, కంప్యూటర్‌కు నేరుగా అనుసంధానం చేసే దిశగా ప్రయత్నాలు చేసింది. చిప్‌ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్టు,

తొలి ఫలితాల్లో స్పష్టమైన ‘న్యూరాన్‌ స్పైక్‌ డిటెక్షన్‌’ను గుర్తించినట్లు మస్క్ పేర్కొన్నారు.

ఈ చిప్‌నకు ‘ఎన్‌1(లింక్‌)’గా నామకరణం చేశారు. మెదడులో అమర్చే ఎన్‌1 చిప్‌ 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది.

వెంట్రుకలో 20వ వంతు మందం ఉండే సన్నటి దారాల్లాంటి ఎలక్ట్రోడ్లు ఈ చిప్‌లో ఉంటాయి. మెదడులో ఈ చిప్‌ను పెట్టి అందులో ఉండే 3 వేలకు పైగా సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు.

ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి.

ఇలా మెదడు కదలికల సిగ్నల్స్‌ను రికార్డు చేసిన ఈ చిప్‌.. వైర్‌లెస్‌గా ఓ యాప్‌నకు ఆ వివరాలను చేరవేస్తుంది.

మెదడు ద్వారా ఆలోచిస్తూ కంప్యూటర్‌ మౌస్‌ కర్సర్‌ను కదలించేలా, కీబోర్డు అక్షరాలను ఎంటర్‌ చేసేలా ప్రాథమికంగా పరిశోధనలు చేయనున్నారు.

చిప్‌ సాయంతో  కంప్యూటర్లను ఉపయోగించగలుగుతారు.

వాస్తవానికి మోటార్ న్యూరాన్ వ్యాధితో వీల్ చైర్‌కే పరిమితం అయిన స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ల కోసం ఈ టెక్నాలజీని అభివ్రుద్ధి చేశారు.

కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నవారి మెదడులో ఒక చిప్‌ను అమర్చి, దాన్ని కంప్యూటర్,

ఫోన్‌కు అనుసంధానం చేసి వారి మెదడులో ఆలోచనలను అక్షర రూపంలోకి మార్చే అవకాశాన్ని కల్పించడమే ఈ టెక్నాలజీ అసలు ఉద్దేశ్యం.

నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను ఏఐ (కృత్రిమ మేధ) ఆధారంగా ఈ చిప్‌ సాయంతో మెరుగుపరిచే అవకాశమున్నది.

ఈ చిప్‌ సాయంతో పక్షవాతం వచ్చినవాళ్లు కూడా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను సులభంగా ఉపయోగించగలుగుతారు.

మెదడు ఆదేశాల మేరకు శరీరంలోని అవయవాల పనితీరు ఆధారపడి ఉండటంతో..

మెదడు ఆదేశాలు అందక చచ్చుబడిపోయిన అవయవాలను కూడా ఈ చిప్‌ సాయంతో సిగ్నల్స్‌ పంపి తిరిగి పనిచేయించవచ్చు.

elon

టెక్నాలజీ రెండువైపులా పదునుండే కత్తి లాంటిది. ప్రస్తుతం కంప్యూటర్లు, ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లే భవిష్యత్తులో మనిషి మెదడులోని చిప్‌ను హ్యాక్ చేస్తే ఎట్లా.. అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

పక్షవాతం కారణంగా కదల్లేని వారి శరీరంలో అమర్చే న్యూరల్‌ ఇంప్లాంట్లను వేరెవరైనా హ్యాక్‌ చేసి సదరు మనుషులను తాము చెప్పినట్టల్లా రోబోల్లా ఆడించే ప్రమాదం ఉందనే ఆందోళనలున్నాయి.

దీంట్లో ఇంకో ముప్పు కూడా ఉంది. ఇప్పుడు బాగా డబ్బున్నవాళ్లు ఖరీదైన ఫోన్లు కొనుక్కున్నట్టే..

భవిష్యత్తులో తమ బ్రెయిన్‌ ఇంప్లాంట్లకు అత్యంత ఖరీదైన అప్‌గ్రేడ్‌లు చేయించుకుని తెలివిని పెంచేసుకుంటే బాగా తెలివైనవాళ్లు.. తెలివి తక్కువగా ఉన్నవారు అనే వర్గాలుగా మానవాళి విడిపోతుందన్న ఆందోళన కొందరిలో ఉంది.

 

Also Read : బీఆర్ఎస్ స్కెచ్ తో దిమ్మతిరిగిన కాంగ్రెస్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *