‘మెగా 157’ షూటింగ్‌లో నయన్ ఎంట్రీ

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో #Mega157 రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది.
చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తున్న నయనతార తాజాగా ముస్సోరీలో షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కథా పరంగా, తన పాత్రపై ఎంతో ఆనందంగా వున్న నయనతార, సినిమా ప్రమోషన్‌ల్లో చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నారు.

ఇటీవలే ఆమె ఒక ప్రత్యేక ప్రమోషనల్ వీడియో చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాబోయే ప్రచార కార్యక్రమాల్లో నయనతార అదరగొట్టబోతున్నారు. కమర్షియల్ ఫార్మాట్లలో హిలేరియస్ ఎంటర్ టైనర్స్ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్ అయిన అనిల్ రావిపూడి ప్రమోషనల్ కంటెంట్‌ను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు ప్రతి ప్రమోషనల్ వీడియో మంచి ముద్ర వేసింది. ఇటివలే రిలీజ్ చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్ అవతార్‌లో కనిపించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *