హీరో నారా రోహిత్ నిశ్చితార్థం అయితే చేసుకున్నాడు కానీ పెళ్లి ఊసే లేదు. అయితే సినిమాలకు కొద్దిగా బ్రేక్ తీసుకుందామనుకుంటే అది కాస్తా లాంగ్ బ్రేక్ అయ్యిందని ‘భైరవం’ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక ఆయన నటించడని అంతా ఫిక్స్ అయిపోయిన తరుణంలో‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నారా రోహిత్‌కు ‘ప్రతినిధి’ హీరోయిన్ శిరీషతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లిపీటలెక్కుతారనుకున్న సమయంలో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణంతో వివాహం వాయిదా పడింది. ఏడాది మాసికం అవగానే పెళ్లి చేసుకుంటాడట. అంటే అక్టోబర్‌లో తన వివాహం ఉంటుందని నారా రోహిత్ స్పష్టం చేశాడు. ‘ప్రతినిధి 2’ తర్వాత ప్రస్తుతం ‘భైరవం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే బీభత్సంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. ఈ ప్రమోషన్స్‌లోనే తన పెళ్లి ఎప్పుడనేది నారా రోహిత్ రివీల్ చేశాడు.