అక్కినేని ఇంట పెళ్లి వేడుకలు మొదలు అయ్యాయి. ఇటీవలే అఖిల్ కి జైనబ్ రవ్జీతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
అక్కినేని నాగచైతన్య శోభితా దూళిపాళ్ల వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో డిసెంబర్ 4న జరగనుంది.
ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా మొదలయ్యాయి.
తాజాగా ఈరోజు హల్దీ వేడుక సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు సాంప్రదాయ పద్దతిలో కాబోయే కొత్త జంటను ఒకే చోట ఉంచి మంగళస్నానాలు చేయించారు.
ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు.
ఇటీవల నాగచైతన్య మాట్లాడుతూ : శోభితతో తన జీవితాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుపుకుంటాం.
అన్నపూర్ణ స్టూడియోస్ తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకం అని, స్టూడియోస్‌లోని తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) విగ్రహం ఎదురుగా పెళ్లి జరగనున్నట్లు తెలిపారు.
తాతయ్య ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలనే ఉద్దేశంతో ఇరుకుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు.
సంజు పిల్లలమర్రి
Also read this : అందుకే రష్మిక ప్లేస్ లో శ్రీలీలను తీసుకున్నాం…
