AP Politics :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు.
ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆయనతో మండలి చైర్మన్ మోషేన్ రాజు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేయించారు.
శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నాగబాబు సచివాలయంలో మర్యాదపూర్వకరంగా కలిశారు.
నాగబాబుతో పాటు మరో నలుగురు సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర,
బీటీ నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.
ఈ క్రమంలోనే నాగబాబుకు త్వరలోనే మరో అవకాశం దక్కనున్నట్టు సమాచారం.
ఆయనకు పర్యాటకశాఖ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read This : ‘దేవర2’ స్టోరీ ఏంటో చెప్పేసిన ఎన్టీఆర్