Naga Vamsi: ఇంత యాటిట్యూడ్ ఉన్న వ్యక్తితో ఎలా సినిమా తీయాలా అనుకున్నా..

ఇవాళ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. నిర్మాత నాగవంశీ సైతం ఒక ఆసక్తికర పోస్ట్‌తో విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు నటీనటులను చూసి అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలా అపార్థం చేసుకున్న వారిలో ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ టాప్‌లో ఉంటాడని.. కానీ ఆయనతో మాట్లాడిన తర్వాత ఎలాంటి వాడనేది అర్థం కాలేదంటూ నాగవంశీ తన పోస్టులో పేర్కొన్నారు. పరిశ్రమలో అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులలో విజయ్ దేవరకొండ ఒకరు. మా మొదటి మీటింగ్‌కు ముందు ఇంత యాటిట్యూడ్ ఉన్న హీరోతో సినిమా ఎలా తీస్తామో అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ విజయ్‌ను కలిసిన తర్వాత ఆ ఆలోచనలన్నీ మారిపోయాయి. అతను చాలా చాలా చక్కగా మాట్లాడతాడు. అలాగే ఎదుటి వ్యక్తులకు మంచిగా గౌరవం ఇచ్చే వ్యక్తులలో ఒకరు. ప్రపంచం చూసే విధానానికి విజయ్ దేవరకొండ చాలా భిన్నంగా ఉంటాడు’’ అని చెప్పి విజయ్ దేవరకొండకు నాగవంశీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరాలు మీకు మరిన్ని బ్లాక్‌బస్టర్‌లను, అలుపెరుగని విజయాన్ని అందివ్వాలని కోరుకుంటున్నట్టు నాగవంశీ తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *