యువసామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ హై ఎమోషనల్ డ్రామాతో కూడిన ఈ చిత్రం,
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించగా, చందూ మొండేటి దర్శకత్వం వహించారు.
విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా ప్రమోషన్లు శరవేగంగా సాగుతూ, ప్రముఖ సెలబ్రిటీల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి.
ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడి పాత్రలో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.
సినిమా కథాంశం రియల్ లైఫ్ ఆధారంగా ఉండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ ప్రివ్యూను వీక్షించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున, సినిమాపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.
యాక్షన్, డ్రామా, రొమాన్స్ అద్భుతమైన సినిమా అంటూ నాగార్జున ప్రశంసలు కురిపించారు.
ఇద్దరి నటనపై నాగార్జున ఫిదా అయ్యారని టాక్. నిర్మాత అల్లు అరవింద్, తమిళ స్టార్ కార్తి, బాలీవుడ్ లెజెండ్ ఆమిర్ ఖాన్ ఇప్పటికే సినిమాపై ప్రశంసలు కురిపించారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి.
ఫిబ్రవరి 7న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
విడుదలకు ముందే భారీ బజ్ సృష్టించిన తండేల్, థియేటర్లలో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.
ఈ సినిమా అతని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. విజయం సాధిస్తే మరింత క్రేజ్ రావడం ఖాయం.
సంజు పిల్లలమర్రి
Also Read This : అన్ కాంప్రమైజ్డ్ పర్సనాలిటీ శేఖర్ కమ్ములది…