“స్వయంభు”, “నాగబంధం”తో ప్రేక్షకుల ముందుకొస్తున్న హీరోయిన్ నభా నటేష్

బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ కు ఈ సమ్మర్ ఎంతో స్పెషల్ గా ఉండబోతోంది. ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు స్వయంభు, నాగబంధం ఈ వేసవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కిన ఈ రెండు చిత్రాల్లో నభా డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. నాగబంధం చిత్రంలో పార్వతి క్యారెక్టర్ లో, స్వయంభు చిత్రంలో సుందరవల్లి అనే యువరాణి పాత్రలో ఆమె నటిస్తోంది.

ఈ రెండు చిత్రాలతో ఆమె సాలిడ్ లైనప్ చేసుకుందని చెప్పుకోవచ్చు. స్వయంభు, నాగబంధం చిత్రాల్లోని కంటెంట్ ఆడియెన్స్ కు రీచ్ అయితే నభా నటేష్ హీరోయిన్ గా మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ఈ రెండు చిత్రాల విజయాల పట్ల, తన క్యారెక్టర్స్ కు రాబోయే రెస్పాన్స్ పట్ల నభా నటేష్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇప్పటికే స్వయంభు, నాగబంధం చిత్రాల టీజర్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇలా ఒక యంగ్ హీరోయిన్ నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు సమ్మర్ రిలీజ్ కు వస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *