Hero Nani: నా ఫోన్ మొత్తం మెసేజ్‌లతో నిండిపోయింది

నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబోలో వచ్చిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ సినిమా ఇవాళ (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక అద్భుతమైన రిలీజ్ డే. పొద్దున లేచి చూస్తే నా ఫోన్ అభిమానులు, శ్రేయోభిలాషుల మెసేజ్‌లతో నిండిపోయింది. ఈరోజు నుంచి నిత్యం ఒక సెలబ్రేషన్‌లా ఉండబోతోంది. ఇదసలు ఎక్కడికెళ్లి ఆగుతుందో కూడా మా టీం అంచనాలకు అందకపోవడంతో ఎలాంటి స్టేట్‌మెంట్సూ ఇవ్వడం లేదు. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ గొప్పి ఆనందాన్నిచ్చింది. ఇది నాలుగైదు సెలబ్రేషన్స్ చేస్తే కానీ ఆగదు. ఈ రోజు రాత్రికి అమెరికా వెళ్లుతున్నా. అక్కడే నాలుగైదు రోజులు ఉంటాను. వచ్చిన వెంటనే సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుందాం’’ అన్నారు.

నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘మే 1న మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీసుకుంది. గత నెలలో చాలా సినిమాలొచ్చాయి కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్స్‌కి రాలేదు. గత నెలలో సరైన సినిమాలు లేక తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో మా హోప్స్ అన్నీ కూడా హిట్ 3 పైనే.. ఈ సినిమాకు ఏ రేంజ్‌లో ప్రేక్షకులు ఫుల్స్ ఇస్తారోనని ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాకి ఎక్కడ చూసినా యునానమస్ గా చివరి అరగంట సినిమా సినిమా అదిరిపోయిందనడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది’’ అన్నారు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ‘‘సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందంగా అనిపించింది. నాని గారి నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. టీం అంతా చాలా కష్టపడి దేశం నలుమూలలా తిరిగి మంచి మంచి విజువల్స్ షూట్ చేశాం. అదంతా థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది’’ అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *