నటుడు రాజీవ్ కనకాల, నటుడు, రచయిత హర్షవర్ధన్ మంచి స్నేహితులు. వీరిద్దరికీ సంబందించిన ఆసక్తికర విషయాన్ని తాజాగా హర్షవర్థన్ ట్యాగ్ తెలుగు ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అసలేం జరిగిందంటే.. వీరిద్దరూ రెండు రోజుల పాటు నిద్రాహారాలు మానేసి మీరు చేసిన పనేంటని ట్యాగ్ తెలుగు హర్షవర్ధన్‌ని ప్రశ్నించగా.. ‘‘కార్డ్స్ ఆడుతూ కూర్చున్నాం. రాత్రి 8 గంటలకు కూర్చొని.. మూడో రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకూ కార్డ్స్ ఆడుతూనే ఉన్నాం. మా ఫ్రెండ్స్ వచ్చి చూసి వీళ్లకేమైనా పిచ్చి పట్టిందా? వాష్‌రూమ్‌కైనా వెళ్లారా? అని అడిగారు. మేము మాట్లాడకపోయేసరికి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేను చాలా లాస్. రూ.350 కోట్ల లాస్. మూడో రోజు సమీర్ వచ్చాడు. ‘ఎంతరా బాకీ అన్నాడు’. రూ.360 కోట్లు అన్నాడు రాజీవ్. కోట్లా అని ఆశ్చర్యంతో సమీర్ వెళ్లిపోయాడు. ఆ తరువాత సుమ వచ్చింది. వీడు మీనాక్షి పాన్ నములుతూ ఆడుతున్నాడు.
నేను సుమను చూశాను. ఆమె సీరియస్‌గా చూస్తోంది. నాకు గుండె ఆగినంత పనైంది. వారిద్దరూ నా వల్ల విడిపోబోతున్నారా? నావల్ల అని భయపడిపోయా. వీడినేమైనా హత్య చేస్తుందా? అని అనుకుంటున్నా. నేను సుమను చూపించా. అప్పుడు రాజీవ్.. సుమను చూసి నవ్వాడు. ఆ తరువాత సుమను చూసి రాజీవ్ నవ్వడం చూసి ఆగ్రహంతో సుమ అక్కడి నుంచి వెళ్లిపోయింది. రాజీవ్ కూడా వెనుకే వెళ్లాడు. ఇక రాజీవ్ రాడనుకున్నా. నేను అంతా సర్దేస్తున్నా. వాడొచ్చి ఆడుదాం అంటున్నాడు. ఇంక వద్దు ఆపేద్దాం. రెండ్రోజులు పేకాడటం ఏంటిరా? అన్నా. నేను వెళుతుంటా పైనుంచి పిలిచి రూ.328 కోట్లు అన్నాడు. పోరా.. నా దగ్గర 328 పైసలు కూడా లేవని వెళ్లిపోయా’’ అంటూ సరదాగా హర్షవర్ధన్ విషయాన్ని పంచుకున్నాడు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ఏదైన ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాలే..
