లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ జట్టు భారీ అంచనాలతో బరిలోకి దిగింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 203 పరుగులు చేసి ప్రత్యర్ధి ముందు గట్టి లక్ష్యాన్ని ఉంచింది.
ఛేజింగ్ కు వచ్చిన ముంబై బ్యాటర్లు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలం అయ్యింది.
ఆఖరి ఓవర్ మూడవ బంతికి లక్నో విజయం ఖరారైనది.
చివరి ఓవర్ లో 22 పరుగులు అవసరమైతే తొలి బంతికే సిక్స్ కొట్టటంతో ముంబై ఆశలు సజీవంగా ఉన్నాయి.
తర్వాత బంతికి 2 పరుగులు మాత్రమే రావటంతో ముంబై జట్టు ఓటమి కన్ఫర్మ్ అయింది.
సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ క్రీజ్ లో ఉన్నప్పుడు ముంబై ఆశలు సజీవంగానే ఉన్నాయి.
అప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టు గెలుపు అవకాశాలు బాగానే ఉన్నా కూడా లక్నో జట్టు మాత్రం తన పోరాట పటిమను ప్రదర్శిన్చింది.
ఫైనల్గా ముంబై మరో ఓటమి చవిచూసింది.
శివ మల్లాల