మరోసారి చెలరేగి ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ గెలుపు
బుధవారం హైదరాబాద్ లో జరిగిన ఐపీఎల్ 41 మ్యాచ్ ముంబై ఇండియన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 143 పరుగులు మాత్రమే చేసింది. సన్రైజర్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ట్రావిస్ హెడ్ డక్ అవుట్తో హైదరాబాద్ పతనం ప్రారంభం అయ్యింది. ఇమిడియట్గా మరో బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా చేతులెత్తేయడంతో 13 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది హైదరాబాద్ జట్టు. బౌల్ట్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో 4 వికెట్స్ తీసి సన్రైజర్స్ టీమ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. క్లాసన్ 44 బంతుల్లో 71 పరుగులు ( 9 ఫోర్లు 2 సిక్సర్లు) అభినవ్ మనోహర్ 37 బంతుల్లో 43 పరుగులు ( 2 ఫోర్లు 3 సిక్సర్లు) కొట్టటంతో స్కోర్ చచ్చి చెడి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు రెండో ఓవర్ లోనే వికెట్ తీసి హైదరాబాద్ కు ఆశలు కలిగించాడు. ఆ ఆశలు ఎక్కువసేపు నిలవలేదు. రోహిత్ చెలరేగి ఆడటంతో 70 పరుగుల ( 46 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లు) , సూర్య కుమార్ యాదవ్ 40 పరుగులు నాటౌట్ ( 19 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లు) చేసి ముంబై జట్టును మరో 26 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేర్చాడు. 7 వికెట్ల తేడాతో ముంబై ఎస్ ఆర్ ఎచ్ టీంను ఓడించింది. ట్రెండ్ బౌల్ట్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు. నాలుగు వరుస విజయాలు సాధించిన ముంబై జట్టు 2025 ఐపీఎల్ టోర్నీఆశలను సజీవంగా ఉంచుకుంది.
శివ మల్లాల
Also Read This : పాపాల లెక్క త్వరలోనే తేలాలి…