వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించే యానిమేషన్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈ సంస్ద నుంచి వచ్చిన తాజా యానిమేటెడ్ ఫిల్మ్ “ముఫాసా ది లయన్ కింగ్”.
2019లో విడుదలైన “ది లయన్ కింగ్”కు ప్రీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో
ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. అప్పట్లో ది లయన్ కింగ్ కు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం.
ఇక కథ విషయానికి వస్తే : ముఫాసా కొన్ని పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులకు దూరమవుతాడు.
అనాథగా మారిన ముఫాసాను టాకా అలియాస్ స్కార్, అతడి తల్లి ఇషే చేరదీస్తే.. తండ్రి ఒబాసీ వ్యతిరేకిస్తాడు.
ముఫాసాను ఆదరించి తన సొంత సోదరుడిగా టాకా ప్రేమను కురిపిస్తాడు. టాకా, ముఫాసా మధ్య స్నేహం బలంగా మారుతుంది.
అయితే ఒబాసి సామ్రాజ్యంపై శత్రు సేనలు (తెల్ల సింహాలు) దాడి చేస్తారు. ఆ దాడిని తప్పించుకోవడానికి పారిపోవాలని టాకా, ముఫాసాకు ఒబాసి సలహా ఇస్తాడు.
అనాథగా మారిన ముఫాసాకు ఎదురైన సమస్యలు, అవమానాలు ఎలాంటివి? టాకాతో కలిసి ముఫాసా ఎలాంటి జీవితాన్ని ఆస్వాదించాడు?
అసలు టాకాకి స్కార్ అనే పేరు ఎలా వచ్చింది? ఒబాసి రాజ్యంపై దండెత్తిన శత్రువుల బారినుంచి ముఫాసా,
టాకా ఎలా తప్పించుకొన్నారు? బలమైన శత్రువులను ఎదురించి టాకాను ముఫాసా ఎలా కాపాడాడు? శత్రువులతో ముఫాసా ఎలాంటి పోరాటం చేశాడు?
చివరకు తన కుటుంబాన్ని ముఫాసా చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానామే ముఫాసా ది లయన్ కింగ్ సినిమా కథ.
మహేష్ కోసం అని కాకుండా మంచి యానిమేషన్ మూవీగా ఈ సినిమా చూడవచ్చు.
3/5 Rating
సంజు పిల్లలమర్రి