MP Balashowry :
వైయస్‌ఆర్‌సిపి మచిలీపట్నం యంపి బాలశౌరి రాబోయే ఎలక్షన్‌లో ఏం జరగబోతుందో ముందుగానే ఊహించినట్లున్నారు.
ఎలక్షన్లకు సరిగ్గా మూడు నెలల ముందు బ్లూ కండువా వద్దనుకుని ఎర్ర కండువా కప్పుకొని పవన్‌కల్యాణ్ పక్కన చేరారు.
బాలశౌరి పార్టీ మారగానే అన్ని పార్టీలవారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బాలశౌరి గెలుపు గుర్రం అనే సంగతి అందరికి తెలుసు.
అయినా కూడా తాను పార్టీ నుండి వెళ్లిపోతుంటే అధికార పార్టీ వారందరూ ఆయన్ను ఎంతో బతిమాలారట.
ఏమైందో ఏమో కాని తన ఆత్మాభిమానం దెబ్బతినింది అని వైయస్‌ఆర్‌సిపి నుండి జనసేన పార్టీలోకి మారి యంపి టికెట్‌ను దక్కించుకున్నారాయన.
ఏదేమైతేనేం వైయస్ జగన్ పార్టీ రానున్న ఎలక్షన్‌లో ఓడుతుందని ముందుగానే వాసన పసిగట్టి జంప్ అవ్వటంతో నక్కని తొక్కేశారనే చెప్పాలి.
దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో జనసేన నుండి గెలుపొంది గెలుపు గుర్రం హోదాను నిలబెట్టుకున్నారు. కంగ్రాట్స్ టు యంపి బాలశౌరి….