ముంబైలో జరిగిన ఐపీఎల్ 45 వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై భారీ విజయం సాధించింది. టాస్ గెలిచిన లక్నో జట్టు ముంబై టీంను బ్యాటింగ్ చేయమని ఆదేశించింది. 32 బంతుల్లో రిక్లెల్టన్ 58 పరుగులు ( 6 ఫోర్లు 4 సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ 28 బంతుల్లో 54 పరుగులు ( 4 ఫోర్లు 4 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేయటంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన లక్నో జట్టు మిచెల్ మార్ష్ 24 బంతుల్లో 34 పరుగులు ( 3 ఫోర్లు 2 సిక్సర్లు) , నికోలస్ పూరన్ 15 బంతుల్లో 27 పరుగులు ( 1 ఫోర్ 3 సిక్సర్లు), ఆయుష్ బదోని 22 బంతుల్లో 35 పరుగులు (2 ఫోర్స్, 2 సిక్సర్లతో) , డేవిడ్ మిల్లర్ 16 బంతుల్లో 24 పరుగులు ( 3 ఫోర్లు) లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ నుంచి వేగంగా పరుగులు చేసినప్పటికీ వికెట్స్ వెంట వెంటనే కోల్పోవడంతో 20 ఓవర్లలో 10 వికెట్ల కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేసింది. 54 పరుగుల తేడాతో లక్నో పై ముంబై విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై జట్టులో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీసి లక్నోను కోలుకోలేని దెబ్బకొట్టారు.
శివ మల్లాల