Megastar : అప్పుడే ఇన్నేళ్ళయిందా …చిరంజీవికే తెలియలేదు….

Megastar :

తెలుగు చిత్ర సీమలో చిరంజీవిగారి నట ప్రస్థానం గురించి అందరికి తెలుసు. శివ శంకర వరప్రసాద్‌ నుండి చిరంజీవిగా మారిన తర్వాత తన కఠోర శ్రమతో ఎవ్వరు ఊహించని ఎత్తుకు ఎదిగారాయన.

చూస్తుండగానే చిరంజీవి ప్లేస్‌లో డైనమిక్‌ హీరో చిరంజీవి అని టైటిల్‌ పడింది. చిరు అంతటితో ఆగకుండా స్పీడ్‌ మరింత పెంచారు.

డైనమిక్‌ హీరో పేరు కాస్త సుప్రీమ్‌ హీరోగా మారింది.

‘మరణమృదంగం’ సమయానికి చిరంజీవి నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద షేక్‌ చేస్తు బ్రేక్‌డాన్స్‌లు చేస్తుండటంతో మెగాస్టార్‌ చిరంజీవి అంటూ తొలిసారి 70యంయం స్క్రీన్‌మీద టైటిల్‌ పడింది.

చిరు అభిమానులు పులకించిపోయారు. ఆరోజునుండి మెగాస్టార్‌ టైటిల్‌లోని నాలుగక్షరాలు చాలా గొప్పగా ఫీలయ్యాయి.

తన పక్కన చిరంజీవి ఉన్నార న్న ధైర్యంతో. ఆరోజు నుండి మొదలయ్యాయి చిరు నటించిన సినిమాల తాలూకు సక్సెస్‌ల జోరు.

తెలుగు సినిమాకు సంబంధించిన ఏ టాపిక్‌ తీసుకున్న మెగా అనే మాటలేకుండా లేదు. చూస్తుండగానే ఏళ్లు గడిచిపోయాయి. చిరంజీవిగారికి కూడా తెలియలేదు తన మొదటి సినిమా విడుదలై 46ఏళ్లు అయిందని.

తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజులా వెలుగుతూనే 70 ఏట ఎంట్రీ ఇచ్చారాయన. అయినా కూడా మెగాభిమానుల్లో అదే ఉత్సాహం అదే ఉద్వేగం.

తమ హీరో వెంటే ఉంటూ తమ హీరో కుటుంబంలోనుండి వచ్చిన ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటూ మెగా హీరోలకు మెగాభిమానులు ఉన్నారన్న భరోసా కల్పించారు మెగాస్టార్‌.

అందుకే మెగాస్టార్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జీవితంలోని అనేక ముఖ్యఘట్టాలను గుర్తుచేస్తూ

ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ చానల్‌లో శివమల్లాల స్నిప్పెట్స్‌ (యస్‌.యం.యస్‌) అంటూ చిరంజీవిగారి గురించి ప్రతిరోజు ఒక చిన్నకథను ప్రచురించింది.

అందులో అందించిన చిన్నకథల వివరాలు ఇవి. చిరంజీవి గారి గురించి తెలుసుకోవాలి అని ఈ జనరేషన్‌లోని సినిమా లవర్స్‌ ఎవరైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి ఎంతో ఇన్సిపిరేషన్‌గా ఉంటాయి.

1.చిరంజీవి మెగాస్టార్‌ ఎలా అయ్యారు
2. చిరంజీవి కెరియర్లో ఆ ఆరేళ్లు మోత మోగింది..
3. చిరంజీవి గారి కెరీర్‌లో ఈ డేట్స్‌ చాలా స్పెషల్‌..
4. ఆ నలుగురితో 60
5. చిరంజీవి బాడిగార్డు పవన్‌ కల్యాణ్‌
6. ది డార్క్‌ కి చిరంజీవికి సంబంధం ఏంటి?
7. ఎ.కోదండరామిరెడ్డి–చిరంజీవి
8. రాఘవేంద్రరావు– చిరంజీవి
9. ఆ నలుగురు దర్‌వకులెవ్వరు
10. రవిరాజ పినిశెట్టి– విజయబాపినీడు–చిరంజీవి
11. మొదటి 500రోజుల సినిమా
12. దాసరి నారాయణరావు–చిరంజీవి
13. డైనమిక్‌ హీరో నుండి మెగాస్టార్‌గా పయనం
14. చిరంజీవి గారు నటించిన గెస్ట్‌రోల్స్‌
15. కెరీర్‌ మొత్తంలో 11 ఏళ్లు గ్యాప్‌ ఎందుకు వచ్చింది…
16. వాయిస్‌ఓవర్‌ సినిమాలేంటి…
17. ఫిలింఫేర్‌ అవార్డ్సు
18. నంది అవార్డ్సు
19. నేషనల్‌ అవార్డ్సు
20. చిరుగురించే ఎందుకు మాట్లాడాలి….

ఇలా శివమల్లాల స్నిప్పెట్స్‌ అంటూ నేను చేసిన ఈ ప్రయత్నానికి సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్‌…..

ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ చానల్‌ మరియు ట్యాగ్‌తెలుగు.కామ్‌ వెబ్‌సైట్‌ 70వ పడిలోకి ఎంటర్‌ అవుతున్న చిరంజీవిగారికి హ్యాపీ బర్త్‌డే టు మెగాస్టార్‌ చిరంజీవిగారు అంటూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం..

కాన్సెప్ట్‌ అండ్‌ కాంటెంట్‌ బై శివమల్లాల

Also Read This : మోడర్న్ మాస్టర్స్ రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *