Mathu Vadalara 2 :
సమీక్ష : మత్తు వదలరా–2
విడుదల తేది : 13–09– 2024
నటీనటులు : శ్రీ సింహా కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్, ఝాన్సీ, రోహిణి, అజయ్, జబర్దస్త్ రోహిణి, గుండు సుదర్శన్
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ : సురేశ్ సారంగం
సంగీతం : కాలభైరవ
నిర్మాత : చెర్రీ
కథ, దర్శకత్వం : రితేష్ రానా
కథ :
మనకి షీ టీమ్ అనే పోలీస్ వ్యవస్థ తెలుసు. ‘మత్తు వదలరా–2’ సినిమాలోని పదాన్ని అప్‌డేట్ చేసి ‘హి’ టీమ్ అనే పోలీస్ వ్యవస్థను పెట్టి
కొత్తరకమైన కథను తెరమీదకు తీసుకొచ్చారు దర్శకుడు రితేష్ రానా.
అంతకుముందు సినిమా ‘మత్తు వదలరా’తో కొత్తరకం ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులకు తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు రితేష్.
ఈ సినిమాతో కూడా మ్యాజిక్‌ను రిపీట్ చేయాలనుకున్నాడు.
శ్రీసింహా, సత్యలు కూడా హి టీమ్‌లో కీలకమైన సభ్యులుగా ఉంటూ టైమ్ పాస్ చేస్తుంటారు.
ప్రధానంగా హి టీమ్ చేసేది కిడ్నాప్‌లు చేసే డబ్బులు డిమాండ్ చేసిన వారిని పట్టుకుని కిడ్నాప్ అయినవారి కుటుంబాలకి అందచేస్తారు. ఇది క్లుప్తంగా కథ.
ఈ కథలో మిగతా నటీనటులందరు ఎలా ఫిట్ అయ్యారనేదే ఇంట్రెస్టింగ్ కథ. ఈ కథను ఎలా మలిచారు నటీనటుల పనితీరు ఎలా ఉంది అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు :
కథగా చెప్తే ఈ కథ చాలా చిన్న కథ అని చెప్పాలి. అందుకే ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరూ చిత్ర పరిశ్రమలో ఫుల్ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లనే చెప్పాలి.
ముఖ్యంగా ఇలాంటి కామెడిని తెరమీద చెప్పాలంటే దర్శకునికి కామెడి మీద ఫుల్ పట్టుండాలి. అందులో రితేష్ సిద్ధహస్తుడు అని చెప్పాలి.
ముఖ్యంగా కామెడి టైమింగ్ తెలిసిన వాళ్లకెవరికైనా నటుడు సత్య టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యేసుదాసు పేరుతో హి టీమ్‌లో కీలకమైన సభ్యుడు.
సత్య, శ్రీసింహా జట్టుగా ఉంటూ అందరిని వెర్రివాళ్లను ఎలా చేయాలి అనే కాన్సెప్ట్‌తో తిరుగుతు అందరిని ఓ ఆట ఆడుకుంటాడు.
మొత్తానికి ఈ సినిమా చూడాలి అంటే సత్య కోసం టికెట్ కొనాలి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ చాలావరకు రపీటెడ్ సీన్స్‌లాగా అనిపిస్తాయి.
ముఖ్యంగా తన కామెడి టైమింగ్ చాలా ఫాస్ట్‌గా ఉంటూ ఒక జోక్ చెప్పేలోపు మరో కౌంటర్ పడిపోతుండటంతో ఏ జోక్‌ను ఎంజాయ్ చేయాలి అనే పరిస్థితికి ప్రేక్షకుడు వస్తాడు.
సత్య కామెడికి సాయం చేయటానికి ఓ హీరో కావాలి కాబట్టి శ్రీసింహా పక్కన నిల్చున్నట్లుంది. ఎక్కడో నాలుగైదు సీన్లలో మాత్రం శ్రీసింహా పరవాలేదనిపించారు.
ఏదేమైనప్పటికి తన గత సినిమాలతో పోలిస్తే మాత్రం ‘మత్తు వదలరా–2’ బెటర్ సినిమానే అని చెప్పక తప్పదు. అజయ్ ఎప్పటిలాగే తన పరిధి మేరకు బాగానే నటించారు.
ఫరియా అబ్దుల్లా ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించినా కూడా తనదైన ముద్ర వేయటంలో విస్సయ్యారు అని చెప్పొచ్చు.
క్లైమాక్స్‌లో వచ్చే కీలకమైన సీన్లలో తన డ్రెస్సింగ్‌తో మాత్రం యూత్‌ను ఆకట్లుకోవాలి అని ప్రయత్నించింది. ‘వెన్నెల’ కిశోర్ పాత్ర మాత్రం హీరోగా చేసి కొన్ని సీన్లలో అలరించారు.
టెక్నికల్ విభాగం :
ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ విభాగంలో మొదటి మార్కులు పొందేది మాత్రం ఎడిటర్ కార్తీక శ్రీనివాస్‌కె.
కెమెరా వర్క్ చేసిన సురేశ్ పనితనం తెరపై కొట్టొచ్చినటుల కనిపించింది. చాలా సీన్లతో లైటింగ్‌తో ఆడుకున్నారని చెప్పాలి.
సంగీత దర్శకత్వం వహించిన కాలభైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పరవాలేదనిపించిన పెద్దగా గుర్తుంచుకునే పాటలేమి లేకపోవటంతో ప్రమోషనల్ సాంగ్‌తో పని అయ్యింది అనిపించారు.
ప్లస్ పాయింట్స్ :
సత్య కామెడి టైమింగ్, శ్రీసింహా సపోర్టింగ్
కెమెరా వర్క్
ఎడిటింగ్
మైనస్ పాయింట్స్ :
చిన్న పాయింట్
నో లాజిక్స్
ఫైనల్ వర్డిక్ట్ : టైమింగ్, ట్రిక్కి కామెడీని ఎంజాయ్ చేసేవారు ఓ సారి థియేటర్ వైపు చూడొచ్చు.
రేటింగ్ : 2.5/5
శివమల్లాల
Also Read This : వారికి మేము అండగా ఉంటాం….
