మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు విష్ణుతోపాటు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, శివ బాలాజీ తదితరులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో భాగంగా మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు. రేపు సినిమా విడుదలవగానే కన్నప్పకు యాంటీ రివ్యూలిచ్చేందుకు థియేటర్ బయట ఓ బ్యాచ్ సిద్ధంగా ఉందన్నారు. పైగా ఒక థియేటర్ బయట గొడవలు జరుగుతాయని తన వద్ద పక్కా సమాచారం ఉందని తెలిపారు. అయితే ఎవరు యాంటీ రివ్యూలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు? ఏ థియేటర్ వద్ద గొడవలు జరుగుతాయన్న విషయాన్ని మాత్రం మంచు విష్ణు చెప్పలేదు.
ప్రజావాణి చీదిరాల