హీరోల మాటేమో కానీ హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఫేమస్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. కొందరికి ఎంత కష్టపడినా గుర్తింపు రాదు కానీ కొందరికి మాత్రం ఓవర్ నైట్‌లో స్టార్ డమ్ వస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడమా.. నిలబెట్టుకోకపోవడమా? అనేది వారి చేతిలో ఉంటుంది. ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు కూడా అంతే.. అమ్మడికి ఒకే ఒక్క సినిమాతో కావల్సినంత గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతోనే తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ గట్టిగానే పెంచేసింది.
తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సంపాదించుకుని మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ‘డ్యూడ్’, దళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న ‘జయనాయగన్’ చిత్రంలోనూ అవకాశం సంపాదించింది. ఇదివరకు హీరోయిన్‌గా ఒక్కో సినిమాకు రూ.50 లక్షల్లోపే మమిత రెమ్యునరేషన్ అందుకునేదని తెలుస్తోంది. ఇప్పుడు తన రెమ్యూనరేషన్‌ను డబుల్ చేసేసింది. ఒక్కో సినిమాకు ఒక్కోలా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ‘డ్యూడ్’ కోసం రూ.70 లక్షలకు పైనే అందుకుంటున్న మమిత.. దళపతి విజయ్‌తో చేస్తున్న ‘జన నాయగణ్’ కోసమైతే ఏకంగా రూ.కోటి పారితోషికం అందుకుందట. ఒకవేళ ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయో అమ్మడి రేంజే మారిపోతుంది. అప్పుడు రెమ్యూనరేషన్ ఇంకెంత పెంచేస్తుందో చూడాలి.
ప్రజావాణి చీదిరాల