Malla Reddy :
మల్లారెడ్డి మాటల్లో నిజమెంత?
తెలంగాణాలో మళ్లీ టిడిపి పార్టీ వచ్చే అవకాశముందా?
అంటే ఖచ్చితంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు మాజిమంత్రి మల్లారెడ్డి.
తాను రాజకీయంగా ఆరంగేట్రం చేసిన తెలుగుదేశం పార్టీ మరలా తెలంగాణాలో చక్రం తిప్పాలంటే తాను కీలకంగా మారనున్నారని మల్లారెడ్డి అనుకుంటున్నారని సమాచారం.
కీసర మండలం గోదుమకుంట గ్రామంలో ‘హ్యాపిఫీట్’ ప్లే స్కూల్‌ను ప్రారంభించటానికి బి.ఆర్.ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు మాట్లాడారు.
నా శిష్యురాలు మల్లారెడ్డి స్కూల్స్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేసిన లావణ్య ‘హ్యాపిఫీట్’ ప్లే స్కూల్‌ను ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రారంభించటం నాకు ఎంతో సంతోషం అన్నారు.
లావణ్య చాలా టాలెంట్ ఉన్న ప్రిన్సిపల్ అని తన స్కూల్‌లో దాదాపు తొమ్మిదేళ్లపాటు తన సేవలను నిర్వర్తించి ఇప్పుడు సొంతంగా స్కూల్‌ను ప్రారంభించటంతో నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారాయన.
ఈ సందర్భంగా తనతోపాటు ఈ కార్యక్రమానికి హాజరైన లోకల్ నాయకులతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసి కూటమిగా ఏర్పడి పార్టీని బలోపేతం చేసి ఆంధ్రలో అధికార పీఠాన్ని దక్కించుకున్నారని
తెలంగాణాలో మళ్లీ టిడిపి పార్టీ తన కార్యకలాపాలను కొనసాగించటానికి సిద్ధమవుతుందని మల్లారెడ్డి తన చుట్టూ ఉన్నవారితో మట్లాడటం గమనార్హం.
ఇప్పుడుకాని మల్లారెడ్డి పార్టీమారితే తెలంగాణా టిడిపి అధ్యక్ష పదవికూడా దక్కే అవకాశముందని అక్కడివారు చెవులు కొరుక్కున్నారు…ట్యాగ్‌తెలుగు చానల్‌లో మల్లారెడ్డి టిడిపి గురించి మాట్లాడిన ఎక్స్‌క్లూజివ్ వీడియో కంటెంట్ మీకోసం…
Also Read This : పదహారేళ్ల కష్టం ఒక్కమాటతో తుడిచిపెట్టుకుపోయింది