Maharaja :
సినిమా పరిశ్రమలో ఎవరైనా హిట్ అనే రెండక్షరాను జేబులో వేసుకోవాలని సక్సెస్ అనే మూడక్షరాలను పేరు చివర పెట్టుకోవాలని ఎంతో తపన పడుతూ పనిచేస్తారు. అలాంటి హిట్‌ని, సక్సెస్‌ని ‘సుడిగాడు’ సినిమాతో పన్నెండెళ్ల క్రితమే తన ఖాతాలో వేసుకుని లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేద్దాం అనుకున్నాడు ఈ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ వసంత్. దాదాపు 600 సినిమాలకు పైగా సంగీతాన్ని అందించిన సత్యం గారి మనవడిగా అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ శిష్యుడిగా చిత్ర పరిశ్రమలోని అందరికి వసంత్ తెలుసు. సక్సెస్ ఉన్నప్పుడు అందరూ చుట్టాలే…కానీ అదే మనిషికి ఫెయిల్యూర్స్ వస్తే తన పక్కన ఎవరు నిలబడ్డారు? అనే ప్రశ్న వస్తే వసంత్ సమాధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వసంత్‌కి గాడ్‌ఫాదర్ ఎవరులేరు కానీ, గాడ్‌బ్రదర్ మాత్రం ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబోట్ల అని చెప్పారు. ‘మహారాజ’ సినిమాకి రైటర్‌గా పనిచేయటంతో 12 ఏళ్ల తర్వాత విజయం ఆయన తలుపు తట్టింది. వసంత్ సినిమా కధేంటి? అతని కథలోకి వివేక్ ఎలా వచ్చాడు? పవన్‌కల్యాణ్ వారాహికి తన డబ్బింగ్ థియేటర్ వారాహికి సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలను ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్‌తో పంచుకున్నారు. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This Article : వైస్ జగన్ అసెంబ్లీలో పాల్గొనాలి, ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్
