Ravi Antony :
ఇరవై నాలుగు గంటలు ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తూ కలలు కనేవాళ్లకి లెక్కేలేని ఇండస్ట్రీ ఇది.
అలాంటిది అసలతను అనుకోలేదు. ఏనాడు కల కనలేదు.
ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అతనికి అనుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ లాంటి ఒక్క ఫ్రెండ్‌ంటే చాలు. మీకు టాలెంట్ ఉంటే మీ జీవితాల్లోకూడా వెలుగొస్తుంది అంటూ తనని రైటర్‌గా మార్చింది సిధ్దూనే అని గర్వంగా చెప్తాడు.
అనుకోకుండా నటునిగా వచ్చిన అవకాశమే ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలు అంటూ నటునిగా తన అరంగేట్ర కథలు చెప్పాడు ఆంటోని వరుఫ్ రవి.
‘ఆంటోని అనగానే…దేన్‌తోని…’ ఈ ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవటమంటే మాటలు కాదు…అలా చాలా తక్కువమందికే కుదురుతుంది.
అలా రవికి కుదిరింది. మ్యాడ్ చిత్ర నిర్మాత నాగవంశీ కరెక్ట్‌గానే మాట్లాడుతాడు అంటూ బల్లగుద్ది మరి తమ సినిమా నిర్మాత గురించి వాదించాడు.
గద్దర్ గారిలా ఉంగరాల జుట్టు ఉండటంతో ఆయనపై చేస్తున్న ఓ వీడియో సాంగ్‌లో గద్దర్‌లా నటించాడు రవి.
ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో అనేక విషయాలు మాట్లాడారు రవి. అవేంటో మీరు ఓ పాలి చూసేయండి…
ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్….
