‘హరి హర వీర మల్లు’ నుండి మొదటి సింగిల్ ‘మాట వినాలి’ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అప్ డేట్స్ కోసం

ప్యాన్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు.

షూటింగ్ ముగింపులో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొద‌ల‌వుతాయా? అని అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్ కి

తాజాగా ఆ స‌మ‌యం రానే వ‌చ్చేసింది. నేడు తొలి లిరిక‌ల్ సింగిల్ ని రిలీజ్ చేసి అభిమానుల‌కు స‌ర్ప్రైజ్ చేసారు.

మాట వినాలి అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూప‌ర్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ పాట‌ను ఆయ‌నే స్వ‌యంగా అల‌పించ‌డం విశేషం.

సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే మాట వినాలి లిరికల్ వీడియోతో వీర‌మ‌ల్లు ప్రమోషన్స్ మొదలయ్యాయి..

వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి అంటూ తెలంగాణ మాండలికంలో పవన్ కళ్యాణ్ ఈ పాట పాడారు.

అందరూ పాడుకునేలా అర్థవంతమైన పంక్తులు, శక్తివంతమైన జానపద బీట్‌ లతో మాట వినాలి గీతం మనోహరంగా ఉంది.

అటవీ నేపథ్యంలో నైట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీక‌రించిన పాట ఇది.

అడవిలో మంట చుట్టూ వీరమల్లు అనుచరుల బృందం గుమిగూడినట్లుగా లిరికల్ వీడియోలో చూపించారు.

పవన్ కళ్యాణ్ సింపుల్ స్టెప్స్ కి కీర‌వాణి సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లో రిలీజ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో మొదటి గీతాన్ని తెలుగులో మాట వినాలి, తమి ళంలో కెక్కనుం గురువే, మలయాళంలో కేల్‌క్కనం గురువే, కన్నడలో మాతు కేలయ్యా , హిందీలో బాత్ నీరాలి గా విడుదల చేశారు.

తెలుగులో పెంచల్ దాస్, తమిళంలో పి.ఎ. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు.

ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉంది.

నిర్మాణానంతర ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

సంజు పిల్లలమర్రి

Also Read This : ‘సంక్రాంతికి వస్తున్నాం’ వెనుక దిల్ రాజు వ్యూహం

Srinath Maganti
Srinath Maganti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *